ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌టీపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు.
1,080x2,400 పిక్సెల్, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సెటీ 6020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
సెక్యూరిటీ పరంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సైడ్‌కు ఇచ్చారు. దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను అందించారు. 391పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 680 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 91.4 స్క్రీన్ రేషియో ఈ స్క్రీన్ సొంతం.
ఈ స్మార్ట్ ఫోన్‌ను ఐస్ క్రిస్టల్ వైలెట్, జింఘై బ్లాక్, క్వింగ్బో ఎమరాల్డ్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఇక కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికొస్తే.. వై-ఫై, బ్లూటూత్, యూఎస్‌బీ 2.0, 3.5ఎమ్.ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్, ఏ-జీపీఎస్ వంటి ఫీచర్స్‌ను అందించారు. 🌐🔗