📱 సాధారణంగా ఏదైనా గ్రూప్ కాల్ వస్తే.. గ్రూప్‌లోని సభ్యులందరికీ నోటిఫికేషన్‌తో పాటు రింగ్‌టోన్ వస్తుంది. 🔔
ఏదైనా అర్జెంట్ పనిలో ఉన్నా, మీటింగ్‌లో ఉన్నా గ్రూప్ కాల్ వస్తే డిస్బర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. 📆 అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌లో గ్రూప్ కాల్స్ వస్తే ఎలాంటి రింగ్ రాదు. 🔇 గ్రూప్‌లోని సభ్యులందరికీ కేవలం సైలెంట్ నోటిఫికేషన్ మాత్రమే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. 📲
📌 దీంతో వాయిస్ ఛాట్‌ల పాల్గొనలనుకునే వారు కాల్ ముగిసేలోపు ఎప్పుడైనా జాయిన్ కావొచ్చు. ఈ కొత్త ఫీచర్ సహాయంతో కేవలం 60 నిమిషాలు మాత్రమే మాట్లాడొచ్చు. ఆ తర్వాత దానంతటదే కాల్ కట్ అవుతుంది. కాల్‌లో జాయిన్ అయిన వారు మాత్రమే వాయిస్ ఛాట్‌ను వినొచ్చు. అయితే ఛాట్‌లో పాల్గోనని వారు కూడా కాల్‌లో పాల్గొన్నవారి ప్రొఫైల్‌ను చూడొచ్చు.
🗣️ ఈ వాయిస్ చాట్‌ల్లోనూ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను తీసుకొచ్చారు. 🔒 దీంతో సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. ఇక గ్రూప్ చాట్‌లో పైన రైట్‌సైడ్ కనిపించే వేవ్‌ఫార్మ్ ఐకాన్‌పై క్లిక్ చేసి వాయిస్ చాట్ ప్రారంభించవచ్చు. 🎉 ప్రస్తుతం ఈ ఫీచర్ 33 పైబడి సభ్యులున్న గ్రూపులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 🔄 త్వరలోనే అందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. 🎉