top of page

🔋📱 ఒక్కసారే రీచార్జ్.. ఏడాది పాటు వ్యాలిడిటీ.. ప్లాన్ ధర తెలిస్తే షాక్..

📞 ఎయిర్‌టెల్‌ వార్షిక రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌ ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ. 1,799 రీఛార్జ్ ప్లాన్ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

ఉచిత అపరిమిత కాలింగ్, 3,600 ఎస్‌ఎంఎస్‌, 24జీఈ 4జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ధర నెలకు రూ. 150 కంటే తక్కువ పడుతుంది. ఎయిర్‌టెల్ వింక్‌మ్యూజిక్‌ నకు యాక్సెస్, హలో ట్యూన్‌లకు ఉచిత యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలను పొందొచ్చు. 🎉

📱 బీఎస్‌ఎన్‌ఎల్‌ వార్షిక రీచార్జ్ ప్లాన్.. ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే ఈ సంస్థ రూ. 1,251తో ప్రత్యేక వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది. 0.75జీబీ డేటాతో 365 రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. కనీస మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం ద్వారా తమ ఫోన్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్‌ చాయిస్‌. 📞💲

📲 జియో వార్షిక రీచార్జ్ ప్లాన్.. రూ. 1,559తో వచ్చే ఈ రీచార్జ్ ప్లాన్ 336 రోజులు (11 నెలలు) చెల్లుబాటు అవుతం. 24 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 3,600 ఎస్‌ఎంఎస్‌ (రోజుకు 100) అందిస్తుంది. 5జీ వినియోగదారులు ఎటువంటి డేటా క్యాప్ లేకుండా అపరిమిత 5జీ డేటాకు యాక్సెస్ పొందుతారు. అంతేకాకుండా, ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాప్‌లను కాంప్లిమెంటరీగా యాక్సెస్‌ పొందుతారు. 📺🎬🌐

📞 వీఐ వార్షిక రీచార్జ్‌ ప్లాన్‌.. రూ. 1,799తో రీచార్జ్‌ చేస్తే 365 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఉచిత అపరిమిత కాలింగ్, 24 జీబీ 4జీ డేటా 3,600 ఎస్‌ఎంఎస్‌ను కలిగి ఉన్న ఎయిర్‌టెల్‌ ప్లాన్‌కు సమానమైన ప్రయోజనాలను అందిస్తోంది. వినియోగదారులు వీఐ సినిమాలు, టీవీకి ఉచితంగా యాక్సెస్‌ను కూడా పొందవచ్చు. 📱📺🎉

📊 2022 నాటికి భారతదేశంలో 140 మిలియన్లకు పైగా డ్యూయల్ సిమ్ వినియోగదారులు ఉన్నారని సీఎల్‌ఎస్‌ఏ అనే పరిశోధనా సంస్థ ఇటీవలి ఓ నివేదికలో పేర్కొంది. ట్యారిఫ్‌ల పెరుగుదలతో డ్యూయల్ సిమ్ కార్డ్ వినియోగదారులలో క్రమంగా తగ్గుదలని చూసే అవకాశం ఉందని నివేదిక సూచించింది. 📈💳

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page