top of page

"రియల్‌మీ నుంచి ప్రీమియం ఫోన్‌ వచ్చేస్తోంది.. 😃 సూపర్‌ ఫీచర్స్‌..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయడానికి సిద్ధమవుతోంది. రియల్‌మీ జీటీ 5 ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనుంది. ఈ నెల చివర్లో భారత మార్కట్లోకి ఈ ఫోన్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 📱

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. సోనీ నెక్ట్స్ జనరేషన్ ల్వెతియా ఎల్‌వైటీ 808 (LYTIA LYT808) సెన్సర్ మెయిన్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్‌ను అందించారు. 📷 అలాగే ఓమ్నీ విజన్ ఓవీ08డీ10 సెకండరీ సెన్సర్, సోనీ ఐఎంఎక్స్ 890 టెలిఫోటో సెన్సర్‌ను ఇవ్వనున్నారు. 📸

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. 📸 ఇక సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిచనున్నట్లు తెలుస్తోంది. 🤳 ఇప్పటికే చైనాలో ఈ ఫోన్‌ లాంచ్‌ కాగా భారత్‌లో ఎప్పుడనేదానిపై క్లారిటీ లేదు.

ఇక రియల్‌మీ జీటీ5 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిచనున్నారు. 1264×780 పిక్సెల్స్ ఈ స్క్రీన్‌ సొంతం. 📱

ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేయనున్నారు. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌, 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ను అందిచనున్నారు. 100 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌, 50 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో కూడిన 5400 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు. 🔋"


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page