🔥ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ విస్తృతి పెరుగుతుండడం, చిన్న చిన్న పట్టణాల్లోనూ 5జీ సేవలను విస్తరిస్తుండడంతో 5జీ టెక్నాలజీకి సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్‌లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు బ్రాండెండ్ కంపెనీలు 5జీ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.
📱🔥 లావా బ్లేజ్2 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో క్లీన్ యూఐని అందిచారు. 📲👍
📸 ఇక కెమెరా విషయానికొస్తే, ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందిచారు. ఇక సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిచారు. 🤳💃
📽️రెయిర్ కెమెరాతో 2కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోను రికార్డ్ చేసుకోవచ్చు. కెమరా చుట్టూ రింగ్ లైట్‌ను అందిచారు. 🎥 ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. 🔋🔌 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 🕒 కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో వైఫై5, బ్లూటూత్ 5.0, 3.5 ఎమ్‌ఎమ్ జాక్ వంటి ఫీచర్లను అందిచారు. 📶 ఎనిమిది 5జీ బ్యాండ్లకు సపోర్ట్ చేస్తుంది. 🌐 ఇక ఈ ఫోన్ బరువు 203 గ్రాములగా ఉంది. 📏📲 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. 🔒👆