top of page

హానర్‌ నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్‌ వచ్చేసింది.. 📱

ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌లో చైనాలో లాంచ్‌ చేశారు. అక్టోబర్‌ 17వ తేదీ నుంచి హానర్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫోన్‌ను అమ్మకానికి తీసుకురానున్నారు. 🗓️

ఇక భారత్‌లో ఈ ఫోన్‌ను ఎప్పుడు లాంచ్‌ చేయనున్నారన్న దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 🤔 త్వరలోనే భారత్‌లోనూ ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. 🇮🇳 ఈ స్మార్ట్ ఫోన్‌ను గ్లేసియర్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, వైలెట్ కోరల్ కలర్స్‌లో విడుదల చేయనున్నారు. 🌈 ఈ ఫోన్‌లో ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను సైడ్‌కు అమర్చారు. 👆

ఇక ఈ ఫోన్‌ పీచర్ల విషయానికొస్తే.. 📸 హానర్‌ మ్యాజిక్‌ వీఎస్‌ 2 ఫోన్‌లో 7.92 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ ప్యానెల్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. 📺 2,344 x 2,156 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ ఈ డిస్‌ప్లే సొంతం. ఇక సెకండరీ స్క్రీన్‌ విషయానికొస్తే 6.43 ఇంచెస్‌తో కూడిన ఓ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిచారు. 📟 2,376 x 1,060 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను ఈ కవర్ స్క్రీన్‌ సొంతం. 👀 ఇక ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 💨

ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందిచారు. 📷 50 మెగాపిక్సెల్‌+50 మెగాపిక్సెల్‌ + 12 మెగాపిక్సెల్‌తో కూడిన కెమెరా సెటప్‌ను అందిచారు. 📷 సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెలత్స్‌ కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిచారు. 🤳

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 66 వాట్స్‌ వైర్డ్ సూపర్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీను అందిచారు. 🔋🔌

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page