📱 టెక్ మార్కెట్లోకి ఎన్ని రకాల మెసేజింగ్ యాప్‌స్ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణం ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్‌స్‌ను తీసుకొస్తుండడమే.
యూజర్‌ల అవసరాలకు అనుగుణంగా, భద్రతకు పెద్ద పీట వేస్తూ వస్తోంది కాబట్టే వాట్సాప్‌కు యూజర్‌లు పెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే ఏకైక మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ నిలవడానికి దీని ఫీచర్‌స్ కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
👉 అయితే తాజాగా ఈ ఫీచర్‌కు కొనసాగింపుగా వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ‘సీక్రెట్ కోడ్’ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. చాట్ లాక్ ఫీచర్‌లో కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీక్రెట్ కోడ్ ఫీచర్‌లో ఆ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే మీ చాట్ కనిపించేలా చేసుకోవచ్చు.
📱 మీరు కోరుకున్న చాట్‌ను సీక్రెట్ కోడ్ ద్వారా లాక్ చేసకోవచ్చు. ఒకవేళ చాట్‌ను అన్‌లాక్ చేసుకోవాలంటే.. వాట్సాప్ సెర్చ్ బార్‌లో సదరు సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ సీక్రెట్ కోడ్‌ను యూజర్ తన ఇష్టానికి అనుగుణంగా సెలక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్ సెర్చ్ బాక్స్‌లో సదరు సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయగానే చాట్ లాక్‌లో ఉన్న చాట్‌లన్నీ ఓపెన్ అవుతాయి. ప్రస్తుతం బీటా వెర్షన్ యూజర్‌లకు అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచర్ త్వరలోనే యూజర్‌లందరికీ అందుబాటులోకి రానుంది. 🔒🔐🔓