📮 గూగుల్ తన జీమెయిల్ యాప్ వినియోగదారులకు పాత, అవాంఛిత ఈమెయిల్‌లను తొలగించడానికి ఓ మంచి అప్‌డేట్ ఇచ్చింది. ఈ తాజా ఫీచర్ కేవలం ఒకే క్లిక్‌తో ఒకేసారి 50 ఈ-మెయిల్‌లను ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
ఈ తాజా వెర్షన్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 13 లేదా ఆండ్రాయిడ్14 ద్వారా పని చేస్తున్న సామ్‌సంగ్ గెలాక్సీ, గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరిన్ని పరికరాలకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
📧 ఈ తాజా అప్‌డేట్‌యాప్‌లోని మొదటి 50 ఇమెయిల్‌లను తనిఖీ చేస్తుంది. అవసరమైతే నిర్దిష్ట ఇమెయిల్‌లను అన్‌చెక్ చేసే అవకాశం కూడా వినియోగదారులకు ఉంటుంది. డెస్క్‌టాప్ వెర్షన్‌లో కొంతకాలంగా ఇదే ఫీచర్ అందుబాటులో ఉంది. గూగుల్ కేవలం 15 జీబీ ఉచిత నిల్వను అందించే గూగుల్ ఖాతా ఉచిత శ్రేణిలో ఉన్న వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిల్వ నిండినప్పుడు పాత ఇమెయిల్‌లను తొలగించడం ద్వారా వినియోగదారులు కొత్త వాటిని ఉంచడానికి నిల్వ స్థలాన్ని ఖాళీ చేయవచ్చు. ఇటీవల గూగుల్ ఫోటోల కోసం అపరిమిత నిల్వను అందించడం నిలిపివేసింది. గూగుల్ ఫోటోల్లో వారి మల్టీమీడియాను బ్యాకప్ చేసే వినియోగదారులు వారి 15 జీబీ డేటా పరిమితిని త్వరగా వినియోగించుకోవచ్చు. 📸📤