📱 మారుతోన్న కాలానికి, టెక్నాలజీకి యూజర్ల అభి రుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూనే ఉంది కాబట్టే ఎన్ని రకాల యాప్స్ వచ్చినా వాట్సాప్ క్రేజ్ తగ్గలేదు. 😍
ముఖ్యంగా యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వాట్సాప్ నిత్యం ఏదో ఒక ఫీచర్‌ను జోడిస్తూనే ఉంది. 🆕 ఇలా కొంగొత్త ఫీచర్స్‌ను జోడించే క్రమంలో వాట్సాప్ యాప్‌ను సైతం అప్‌డేట్ చేస్తూ వస్తోంది. 📲 దీంతో సహజంగానే పాత ఆపరేటింగ్ సిస్టమ్‌స్‌లో పనిచేసే ఫోన్స్‌లో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తుంది. 🚫 📲 ఇలా ఇప్పటి వరకు చాలా సార్లు వాట్సాప్ తన సేవలను పలు ఫోన్‌లకు నిలిపివేస్తూ వచ్చింది. 📅 ఈ క్రమంలోనే తాజాగా కొన్ని డివైజ్‌లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 📅 ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్లకు తన సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. 📆 అక్టోబర్ 24వ తేదీ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుందని వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది. 📅📱