👥 యూజర్లు ఈ కొత్త ఫీచర్ సహాయంతో కొత్త ప్రదేశాలకు చెందిన అడ్రస్‌లకు సులభంగా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. మెదటగా ఈ ఏఐ ఫీచర్‌ను అమెరికాలో వినియోగదారులకు మ్యాప్స్‌లో జనరేటివ్ AI ఫీచర్లను అందించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ వారం ప్రారంభంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
📸 ఈ ఫీచర్ సహాయంతో మ్యాప్స్‌లో కొత్త ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు, రివ్యూలు, అక్కడి వెదర్‌కు సంబంధించిన వివరాలను ఏఐ కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.
🌍 ఉదాహరణకు మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఏదైనా వస్తువుకు సంబంధించిన అంశాన్ని ఎంటర్ చేయగానే మీకు దగ్గరల్లో ఆ వస్తువులు ఎక్కడ లభిస్తాయి.? వాటి ఫొటోలు, రేటింగ్‌లు, దగ్గరలోని ఇతర వ్యాపారాలు, స్థలాల గురించిన పూర్తి సమాచారాన్ని క్షుణ్ణంగా చూపిస్తుంది.
🍔 అలాగే మీకు ఇష్టమైన ఆహారం కోసం టైప్ చేయగానే ఆ ఫుడ్ ఎక్కడ లభిస్తుంది.? అక్కడికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది.? ఆ ఫుడ్ గురించిన పూర్తి సమాచారం, రేటింగ్ అన్నింటిని ఏఐ టెక్నాలజీ అందిస్తుంది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.