top of page

📱1️⃣5️⃣ వేలకే వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..

📱🎉 భారత మార్కెట్లో వన్‌ప్లస్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో ప్రీమియం బడ్జెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన వన్‌ప్లస్‌ ఇటీవల బడ్జెట్‌ ధరలో ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా రూ. 20 వేలలోపు స్మార్ట్‌ ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తోంది. వన్‌ప్లస్‌ బ్రాండ్‌ నుంచి తక్కువ ధరకు ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు.

📱🚀 వన్‌ప్లస్‌ నార్డ్‌3ఎస్‌ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేను ఇచ్చారు. 2,400 x 1,080 పిక్సెల్స్‌ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ విత్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో లాంచ్‌ చేశారు. ఆండ్రాయిడ్‌ 13 బేస్డ్‌ ఆక్సిజన్‌ ఓఎస్‌ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో పాటు 300 శాతం అల్ట్రా వాల్యూమ్‌ మోడ్‌ను ఇందులో ప్రత్యేకంగా అందించారు.

📷 కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో డ్యూయర్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డెప్త్‌ సెన్సార్‌ను అందించారు. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్‌ సూపర్‌ ఊక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 🌐📷✨

bottom of page