🇨🇳 చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ హానర్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. హానర్ ఎక్స్9బీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి 15వ తేదీన లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
హానర్ ఎక్స్9బీ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ కానున్న తొలి అల్ట్రా బౌన్స్ డిస్‌ప్లే ఫోన్‌గా చెబుతున్నారు. ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ టెక్నాలజీతో ఫోన్‌కు మంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 25 వేల నుంచి రూ. 30 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన కర్వ్‌డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5800 ఎమ్‌ఏహెచ బ్యాటరీని అందించనున్నట్లు సమాచారం. స్క్రీన్‌కు ప్రొటెక్షన్ కోసం ఇందులో త్రీ లెవల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను ఇచ్చారు.
ఈ స్మార్ట్ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో లాంచ్ చేయనున్నారు. ఇక ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్‌ను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌కు 12 నెలల స్క్రీన్, బ్యాక్ కవర్ ప్రొటెక్షన్‌తో పాటు 24 నెలల బ్యాటరీ హెల్త్ వారంటీనీ ఇవ్వనున్నారు. 📲✨