📱 నరేంద్ర మోదీ నేతృత్ంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని గతంలో 15% నుంచి 10% శాతానికి తగ్గించింది.
ఈ భాగాలలో బ్యాటరీ ఎన్క్లోజర్లు, ప్రైమరీ లెన్స్‌లు, బ్యాక్ కవర్స్, ప్లాస్టిక్, మెటల్ కలయికతో తయారు చేసిన వివిధ మెకానికల్ భాగాలు ఉన్నాయి. తాజా తగ్గింపు మొబైల్ ఫోన్ సెక్టార్‌పై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుందని, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో విస్తరణను పెంపొందించడం, పోటీతత్వాన్ని పెంచుతుందని అంచనా వేస్తున్నారు. 🔄 భారతదేశంలో స్మార్ట్ఫోన్ల తయారీ వ్యయాన్ని తగ్గించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. 🇮🇳 చైనా, వియత్నాం వంటి ప్రాంతీయ పోటీదారులతో సమానంగా మార్కెట్ లో భారత్ ముందంజలో ఉండే విధంగా దిగుమతి సుంకాన్ని తగ్గించారు. 📈 అయితే, మొబైల్ కు సంబంధించిన దాదాపు డజను భాగాలపై సుంకాన్ని తగ్గించాలని ఈ రంగంలోని కంపెనీలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. 🌐 ప్రభుత్వం విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించి, కొన్ని వర్గాలలో వాటిని తొలగిస్తే, వచ్చే రెండేళ్లలో భారతదేశం నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు $11 బిలియన్ల నుండి $39 బిలియన్లకు మూడు రెట్లు పెరుగుతాయని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) ముందుగా తెలిపింది. 💰 ఆర్థిక సంవత్సరం 2024లో భారతీయ మొబైల్ పరిశ్రమ సుమారు $50 బిలియన్ల విలువైన మొబైల్ ఫోన్లను తయారు చేస్తుందని అంచనా వేస్తున్నారు. 💲 ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో $55-60 బిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. FY24లో ఎగుమతులు దాదాపు $15 బిలియన్లకు, ఆపై FY25లో $27 బిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. 📊