top of page
Shiva YT

🎥📱 లాంగ్‌ వీడియోలపై టిక్‌టాక్‌ పరీక్షలు.. యూట్యూబ్‌కు షాక్‌ ఇస్తుందా..?

🔍 గూగుల్ యాజమాన్యంలోని వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన యూట్యూబ్‌ను పోటీగా ఈ వ్యూహాత్మకంగా టిక్‌టాక్‌ ఈ అప్‌డేట్‌ తీసుకొస్తుందని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

టిక్‌టాక్‌ యాప్‌నుకు సంబంధించిన ఐఓఎస్‌ బీటా వెర్షన్‌లో మొదటిసారి ఈ కొత్త అప్‌డేట్‌ను టెక్‌ నిపుణులు గుర్తించారు. టిక్‌టాక్‌ మొదట్లో అసలు వీడియో సమయ పరిమితి 15 సెకన్లతో ప్రారంభించబడింది, ఆపై దానిని ఒక నిమిషం వరకు అప్‌గ్రేడ్ చేసింది. ఆపై దానిని మూడు నిమిషాలకు విస్తరించింది.📽️💡✨

🔄 టిక్‌టాక్‌ కొన్ని నెలల క్రితం 15 నిమిషాల వీడియో అప్‌లోడ్ పరిమితిని పరీక్షించడం ప్రారంభించింది. కొత్త 30 నిమిషాల వీడియో పరిమితి చైనీస్ యాప్‌కి కొత్త అవకాశాలను తెరిచే అవకాశం ఉంది. బైట్‌డాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్‌ సంచిత వినియోగదారుల వ్యయంలో యూఎస్‌డీ 10 బిలియన్లను అధిగమించిన మొదటి యాప్‌లో ఒకటిగా నిలిచింది. కేవలం మూడు సంవత్సరాల్లో చైనీస్ షార్ట్-ఫారమ్ వీడియో ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ యూఎస్‌ యూజర్ల నుంచి వాటా నాలుగు రెట్లు పెరిగింది. 2020లో 3 శాతం నుంచి 2023లో 14 శాతానికి పెరిగింది. టిక్‌టాక్‌ అనేక ఇతర సోషల్ మీడియా సైట్‌లకు భిన్నంగా ఉండడంతో యువత ఎక్కువగా వాడుతన్నారని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా యూఎస్‌లోని 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు ఉన్న వారు టిక్‌టాక్‌ను అధికంగా వినియోగిస్తున్నారు.

bottom of page