top of page
Shiva YT

🌐🎉 మార్కెట్‌లోకి మరో నయా ల్యాప్‌టాప్‌ రిలీజ్‌ చేసిన ఆసస్‌..💻✨

🖥️ ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌ల ద్వారం ఆధారంగా పని చేసే ఆసస్‌ జెన్‌బుక్‌ 14 ల్యాప్‌టాప్ 3 కే రిజల్యూషన్, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌తో 14 గుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది.

ఈ ల్యాప్‌టాప్‌ ర రూ.99,990 ధర నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ గరిష్టంగా 32 జీబీ + 1 టీబీ ఎస్‌ఎస్‌డీ నిల్వతో వస్తుంది. ఆసస్‌ జెన్‌బుక్‌ 14 ఓఎల్‌ఈడీ జనవరి 31 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. 💻🛒

🔍 ఆసస్‌ జెన్‌బుక్‌ స్పెసిఫికేషన్లు: 🔵 ఆసస్‌ జెన్‌బుక్ 14 రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 14 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో 60హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్ (నాన్-టచ్), 14 అంగుళాల 3కే 120హెచ్‌జెడ్‌ టచ్‌స్క్రీన్. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.2 కిలోలు. అలాగే 14.9 ఎంఎం థిక్‌నెస్‌తో వస్తుంది. 💻📏 ఈ ల్యాప్‌టాప్‌లో థండర్‌బోల్ట్‌ 4 పోర్ట్‌లు, ఒక యూఎస్‌బీ, 3.2 జెన్‌ 1 టైప్‌ ఏ పోర్ట్‌తో వస్తుంది. 2.1 హెచ్డీఎంఐ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. విండోస్‌ 11 ఆధారంగా పని చేసే ఈ ల్యాప్‌టాప్‌ ఐ5, ఐ7 ప్రాసెసర్‌లతో అందుబాటులో ఉంటుంది. 75 డబ్ల్యూహెచ్‌ లిథియం-పాలిమర్ బ్యాటరీ, 65 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. 🔌🔋

bottom of page