🕵️♂️ వీటిని సేకరిస్తున్నాయి... 🔍 యాపిల్ ప్రైవసీ పాలసీలో పేర్కొన్న 32 డేటా పాయింట్లను ప్రాథమికంగా తీసుకొని సర్ఫ్‌షార్క్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ అధ్యయనం చేసింది. వాటిల్లో సెన్సిటివ్ విషయాలైన పేమెంట్ డీటైల్స్, బ్రౌజింగ్ హిస్టరీ, మీ కచ్చితమైన లోకేషన్ వంటివి కూడా ఉన్నాయి. వీటి ఆధారంగా అధ్యయనం చేసి యాప్స్ కు ర్యాకింగ్ ఇచ్చింది.
🔐 ఆ రెండు యాప్స్... 🌐 మెటా యాజమాన్యంలోని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ గ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లలోనూ డేటా సేకరణ ఒకే విధంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. యాపిల్ ప్రైవసీ పాలసీలోని 32 డేటా పాయింట్ల బట్టి చూస్తే వాటన్నంటిని ఈ రెండు యాప్స్ సేకరిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. మరే ఇతర యాప్లలో కూడా ఇన్ని విధాలుగా డేటా పాయింట్లలో సమాచార సేకరణ లేదని చెబుతున్నారు.
🤨 అయితే రెండు యాప్‌లు... 🔐 జాబితా చేయబడిన అన్ని డేటా పాయింట్‌లను సేకరించినప్పటికీ, అవి పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌తో సహా ట్రాకింగ్ ప్రయోజనాల కోసం ఏడు పాయింట్లను మాత్రమే ఉపయోగించాయని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. ఎక్స్(ట్విట్టర్) మాత్రం అతి తక్కువ డేటాను వినియోగదారు నుంచి సేకరిస్తుందని తెలిపింది. అయితే థర్డ్ పార్టీ యాప్స్ తో భాగస్వామ్యం చేసినప్పుడు ఇది దాదాపు 32 డేటా పాయింట్లను సగం పాయింట్లను యూజర్ ట్రాకింగ్ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తంచింది. దీంతో ఎక్స్ లో డేటా షేరింగ్ పద్ధతుల గురించి ఆందోళనలను పెంచుతుంది. దాదాపు 10 సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ లలో దాదాపు సగటు కంటే ఎక్కువ డేటాను సేకరిస్తున్నట్లు పరిశోధన వెల్లడించింది.