🚀 దక్షిణ ధ్రువంపై ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 నిద్రాణ స్థితిలోనూ తన పని తాను చేసుకుపోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. 🌜
చంద్రయాన్-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్ గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు శుక్రవారం బెంగళూరులో ధ్రువీకరించారు. 🌍 అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్-3 ల్యాండర్‌లో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ LRO ను అమర్చారు. 📡 ఇందులోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ ఎరే ఎల్ఆర్ఏ (LRA) జాబిల్లి దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని వివరించారు. 📅 డిసెంబరు 12 నుంచి ఎల్ఆర్ఏ (LRA) నుంచి తమకు సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొంది. 🛰️