🤖 హ్యూమనాయిడ్ రోబోల తయారీ రంగంలో టెస్లా దూసుకుపోతోందని ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. టెస్లా తయారుచేసిన కొత్తతరం హ్యూమనాయిడ్ రోబో ‘ఆప్టిమస్’ వీడియోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఇందులో ఆప్టిమస్ రోబో ఓ చొక్కాను మడతపెడుతున్న దృశ్యం చూడొచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్టిమస్ రోబో ఈ పనిని పూర్తిగా తనకుతానుగా చేయగలిగే సామర్థ్యాన్ని పొందలేదని చెప్పారు. అయితే, త్వరలోనే స్వతంత్రంగా పనులు చేయగలిగే రోబోను తయారుచేయగలమని మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆప్టిమస్ ఫోల్డ్స్ ఏ షర్ట్’ పేరుతో మస్క్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇలాంటి పనులు తనకుతానుగా చేసే రోబో త్వరలోనే మానవాళికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. 🤖