ఇక ప్రైవసీకి పెద్ద పీట వేస్తుండడం కూడా ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌లో భారీగా రెస్పాన్స్ రావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఇన్‌స్టాలో ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి వాటిలో హైడింగ్ ఫీచర్. ఒకటి అంటే ఉదాహరణకు మీరు పోస్ట్ చసే పోస్టులకు ప్రైవసీ ఆప్షన్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తాము పోస్ట్ చేసే పోస్ట్‌లు ఎవరికి కనిపించాలో ఎంచుకునే అవకాశం ఉంది. 🌐🤳
అయితే తాజాగా ఈ ఫీచర్‌ను స్టోరీలకు సైతం తీసుకొచ్చింది. మిమ్మల్ని ఫాలో అవుతోన్న వారిలో కొందరికి స్టోరీ కనిపించకూడదనుకున్న సందర్భంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఎదుటి వారిని అన్‌ఫాలో చేయకుండానే వారికి మీరు పోస్ట్ చేసే స్టోరీలు కనిపించకుండా చేసుకోవచ్చు. అంతేనా ఇందుకోసం సాధారణంగానే వాడే క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ ఆప్షన్‌ను కూడా సెలక్ట్ చేసుకోవాల్సి అవసరం ఉండదు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 🔒👀
ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడానికి ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేసి ఆ తర్వాత ప్రొఫైల్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పైన కుడివైపు ఉన్న మూడు గీతల సింబల్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం కిందికి స్క్రోల్ చేయగానే ‘హూ కెన్ సీ యువర్ కంటెంట్’ అటే ట్యాబ్‌లో ‘హైడ్ స్టోరీ అండ్ లైవ్’ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి. దీంతో వెంటనే వెంటనే మీరు ఫాలో అవుతున్న అకౌంట్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో స్టోరీ చూడాలనుకున్న వారిని మాత్రమే ఎంచుకుంటే సరిపోతుంది. 🔍👥