top of page

స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసిన పెపీ జీన్స్‌.. ⌚

ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ పెపీజీన్స్‌ టెక్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. పెబెల్‌ కంపెనీతో కలిసి ఓ స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. పెబుల్ ఎక్స్‌ పెపీ జీన్స్‌ పేరుతో ఈ స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చారు.

పెపీ జీన్స్‌ స్టోర్స్‌తో పాటు, ఫ్లిప్‌కార్డ్‌ వంటి ఈ కామర్స్‌ సైట్స్‌లోనూ ఈ స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర విషయానికొస్తే రూ. 2,199గా నిర్ణయించారు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వాచ్‌ను రూ. 1,999 తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.

పెబుల్ ఎక్స్‌ పెపీ జీన్స్‌ స్మార్ట్ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.39 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ ఈ వాచ్‌ సొంతం. ఇందుకోసం ఇన్‌బుల్ట్‌ స్పీకర్‌ను అందించారు.

ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ ద్వారా SMS, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు, రిమైండర్స్‌, కాల్స్ కంట్రోల్‌, అలారం, కాలిక్యులేటర్‌, వెదర్‌ అప్‌డేట్స్‌, మ్యూజిక్ కంట్రోల్‌, హార్ట్‌ బీట్‌ మానిటర్‌, ఎస్‌పీఓ2, స్లీప్‌ ట్రాకింగ్‌తో పాటు టెన్నిస్, రగ్బీ వంటి వివిధ స్పోర్ట్స్ మోడ్‌లను అందించారు. 🌟

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page