top of page

ఆ ఫోన్‌పై ఏకంగా రూ. 3,000 తగ్గింపు.. 💰

శామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జీ తాజా ధరలు.. 📱 ప్రస్తుతం ఈ శామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జీ రూ. 14,499కే అందుబాటులో ఉంది. వాస్తవానికి దీనిని 2023 జనవరిలో లాంచ్ చేసినప్పుడు రూ. 16,499గా ఉండింది.

వినియోగదారులు ఇప్పుడు రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపును పొందుతున్నారు. అంతేకాక అదనంగా మరో రూ. 1,000 వరకూ ప్రత్యేకమైనా తగ్గింపు కూడా ఉంది, అంటే దీనితో ఈ ఫోన్ మీరు కేవలం రూ. 13,499కి కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ శామ్సంగ్ అధికారిక వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధరలు ఇవి. 📊

శామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జీ బెస్ట్ చాయిసేనా.. 👍 ఈ ఫోన్ ధర తగ్గించారు సరే.. మరీ దీనిని కొనుగోలు చేయడం ఉత్తమమేనా అని ఆలోచిస్తే.. ఇదే ధరలో, ఇవే ఫీచర్లతో శామ్సంగ్ ఎం సిరీస్ ఫోన్ ఒకటి ఉంది. అది శామ్సంగ్ గెలాక్సీ ఎం14 5జీ. ఇది కూడా ఏ14 ఫోన్ కు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రెండూ సేమ్ బడ్జెట్లో ఇప్పుడు లభిస్తున్నాయి. రెండు ఫోన్ల పనితీరు ఒకేలా ఉంది. అయితే ఎం14, ఏ 14 కంటే మెరుగైన డిస్ ప్లే, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఏ14 కన్నా ఎం14 మెరుగైన ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. 🌟

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page