top of page
Shiva YT

📱 వాట్సాప్ హిస్టరీని కొత్త ఫోన్లోకి మార్చుకోవడం ఎలా? 🔄

వాట్సాప్ హిస్టరీని ట్రాన్స్ ఫర్ లో మీరు చాట్ సమాచారం మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. మెసేజెస్, మీడియా ఫైల్స్ వంటివి చేసుకోవచ్చు. అయితే పేమెంట్స్, కాల్ హిస్టరీ మాత్రం ట్రాన్స్ ఫర్ కావని తెలుసుకోవాలి. మీరు ప్రక్రియను ప్రారంభించే ముందు కొత్త ఫోన్లో వాట్సాప్ రిజిస్టర్ కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఇలా చేయాలి..

🤖 ఆండ్రాయిడ్ ఫోన్లో...

మొదటిగా మీ పాత మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయాలి.

దానిలో "మోర్" ఆప్షన్స్ లోకి వెళ్లి "సెట్టింగ్స్" ఓపెన్ చేసి, "చాట్స్" లోకి వెళ్లాలి.

దానిలో "ట్రాన్స్ ఫర్ చాట్స్" అనే ఆప్షన్ పై క్లిక్ చేసి "స్టార్ట్" బటన్ ను నొక్కాలి.

ఇప్పుడు మీరు కొత్త ఫోన్లో వాట్సాప్ ను ఇన్‌స్టాల్ చేసి, రిజిస్టర్ చేయండి. అది కూడా మీ పాత ఫోన్లోని వాడిన నంబర్ తో నే రిజిస్టర్ అవ్వాలి.

తర్వాత స్మార్ట్ అనే బటన్ నొక్కడం ద్వారా పాత ఫోన్ స్కాన్ చేయాలి.

తర్వాత అడిగిన పర్మిషన్లు అడుగుతుంది. అవి ఇచ్చాక క్యూఆర్ కోడ్ మీకు కనిపిస్తుంది.

దానిని పాత ఫోన్ సాయంతో స్కాన్ చేయాలి.

తర్వాత అడిగిన పర్మిషన్ మంజూరు చేస్తే "ట్రాన్స్ ఫర్" ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తయ్యాక "డన్" బటన్ పై నొక్కాలి.

🍏 ఐఓఎస్ డివైజ్‌లో...

మీ పాత ఫోన్లో వాట్సాప్ ను ఓపెన్ చేయండి.

"సెట్టింగ్స్" లోకి వెళ్లి "చాట్స్" పై క్లిక్ చేసి, "ట్రాన్స్ ఫర్ చాట్స్ టు ఐఫోన్" పై క్లిక్ చేశాక, "స్టార్ట్" బటన్ ను నొక్కాలి.

కొత్త ఫోన్లో మీ వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసి, పాత ఫోన్లోని వాట్సాప్ కు వినియోగించిన ఫోన్ నంబర్ తోనే కొత్త ఫోన్లోకూడా రిజిస్టర్ కావాలె.

తర్వాత "కంటిన్యూ" బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్యూ ఆర్ కోడ్ మీకు కనిపిస్తుంది.

దానిని పాత ఐఫోన్ తో స్కాన్ చేయాలి. వెంటనే హిస్టరీ ట్రాన్స్ ఫర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ట్రాన్స్ ఫర్ పూర్తయ్యాక, మీ కొత్త డివైజ్ లో ప్రొఫైల్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 🔄

bottom of page