top of page
Shiva YT

📧 జీమెయిల్‌లో ముచ్చటగా మూడు కొత్త ఫీచర్లు..🌐

డెలివరీ ఫిల్టర్ ఎంపిక 📦 చివరి నిమిషంలో బహుమతులు ఇవ్వడానికి సంబంధించిన ఆవశ్యకతను అర్థం చేసుకుని దుకాణదారులకు సహాయపడేలా ఓ ఫిల్టర్‌ను రూపొందించింది. అలాగే షాపర్‌లు తమ శోధనలను ఫిల్టర్ చేయడంతో పాటు వేగంగా డెలివరీ అయ్యే ఉత్పత్తులను గుర్తించడంలో సహాయపడేందుకు ఈ ఫీచర్ అభివృద్ధి చేశారు. జీమెయిల్‌ మొబైల్, డెస్క్‌టాప్ వెర్షన్‌లు రెండింటికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి జీమెయిల్‌ వినియోగదారులు కేవలం సమీపంలోని స్టోర్‌లలో పికప్ చేయడానికి అందుబాటులో ఉన్న వస్తువులను లేదా వ్యాపారికి సంబంధించిన వేగవంతమైన, అత్యంత సరసమైన డెలివరీ ఎంపికపై వివరాలతో పాటు వేగంగా షిప్పింగ్‌కు అర్హత ఉన్న వస్తువులను చూడటానికి ఫిల్టర్‌ను ఎంచుకోవచ్చు.

ప్యాకేజీ ట్రాకింగ్ 📤 డెలివరీ ఫిల్టర్‌లతో పాటు జీమెయిల్‌ వినియోగదారులకు మరింత సమగ్రమైన ప్యాకేజీ ట్రాకింగ్ అనుభవాన్ని కూడా అందిస్తోంది. ముఖ్యమైన డెలివరీ అప్‌డేట్‌లు షాపింగ్ ఈ-మెయిల్‌లో ప్రదర్శితమవుతాయి. ఇన్‌బాక్స్ జాబితా వీక్షణలో, మొబైల్, డెస్క్‌టాప్ పరికరాలలో వ్యక్తిగత ఈ-మెయిల్‌లలో కనిపిస్తాయి. అదనంగా జీమెయిల్‌ ప్యాకేజీ ట్రాకింగ్ సమాచారాన్ని కలిగి ఉన్న ఈ-మెయిల్‌లకు కూడా ప్రాధాన్యతనిస్తుంది. వినియోగదారులు తమ డెలివరీ తేదీల్లో ఏవైనా మార్పుల గురించి త్వరగా సమాచారాన్ని పొందగలరని నిర్ధారిస్తుంది. వినియోగదారులు జీమెయిల్‌లోని సెట్టింగ్‌ల ద్వారా ఎప్పుడైనా ఈ ఫీచర్‌ని ప్రారంభించవచ్చు లేదా నిలిపివేయవచ్చు.

రిటర్న్ పాలసీ యాక్సెస్ 🔄 జీమెయిల్‌ కోసం మూడవ ఫీచర్ వినియోగదారులకు మర్చంట్ రిటర్న్ పాలసీలను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. జీమెయిల్‌ వినియోగదారులకు డెస్క్‌టాప్, మొబైల్ రెండింటిలో షాపింగ్ సంబంధిత ఈ-మెయిల్‌ల ఎగువన ఉన్న వ్యాపారి రిటర్న్ మార్గదర్శకాలకు అనుకూలమైన లింక్‌ను పంపుతుంది. అదనంగా జీమెయిల్‌ గూగుల్‌ శోధన అంతటా రిటర్న్ విధానాలను కూడా హైలైట్ చేస్తుంది. 🔄

bottom of page