top of page

చిట్టి రోబోను నిజంగా చూపించే ‘బయో కంప్యూటర్‌’ 🤖

రజినీకాంత్‌ ‘రోబో’ సినిమాలో మామూలు సిలికాన్‌ రోబోకు ఏఐను జోడించి ‘హ్యూమనాయిడ్‌ రోబో’ చిట్టిగా మారుస్తారు. దీంతో మనుషులు చేసే అన్ని పనులను ఈ రోబో క్షణాల్లోనే పూర్తి చేస్తుంది.

అమెరికాలోని ఇండియానా వర్సిటీ బ్లూమింగ్టన్‌ శాస్త్రవేత్తలు ఇప్పుడు అలాంటి ప్రయోగాన్నే పూర్తి చేశారు. అదే ‘బయో కంప్యూటర్‌’. మనిషిలాగే సమయానుకూలంగా స్పందించే వినూత్న పరికరాన్ని తీసుకొచ్చేందుకు ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ‘బయో కంప్యూటర్‌’ ఉద్దేశం ఇదే. మెదడును పోలిన సూక్ష్మ అవయవాలను పరిశోధకులు ల్యాబ్‌లో తయారు చేశారు. వీటిలోనికి కృత్రిమ మేధ ప్రోగ్రామ్‌ను ఇన్ సెర్ట్ చేశారు. ఈ వ్యవస్థను ఎలక్ట్రానిక్‌ కంప్యూటర్‌కు అనుసంధానించారు. ఏఐతో అనుసంధానించిన బ్రెయిన్‌ ఆర్గనాయిడ్స్‌.. ల్యాబ్‌లో తయారుచేసిన మెదడులోని ఇతర నాడీకణాల్లో ఉత్తేజిత చర్యలను పురిగొల్పుతాయి. ఎలక్ట్రానిక్స్‌, ఏఐ, బీవో అనుసంధానంతో ‘బయో కంప్యూటర్‌’ విశ్లేషణను ప్రారంభిస్తుంది. 🌐🔬


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page