🚗 రెనాల్డ్ క్విడ్.. సిటి పరిధిలో వినియోగించుకునేదుకు బెస్ట్ కారు ఇది. దీనిలో కొత్త రెనాల్ క్విడ్ ఏఎంటీ వన్ లీటర్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 67 బీహెచ్ పీ, 91ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటర్ పై 24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 📍 ఎంబెడెడ్ నావిగేషన్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కలిగి ఉంటుంది. 🗺️
🚗 హ్యుందాయ్ శాంత్రో.. ఈ కారు ఏఎంటీ టెక్నాలజీతో కూడిన కార్లలో బెస్ట్ ఎంపిక అనొచ్చు. 1.1-లీటర్ ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది. 68 హార్స్‌పవర్, 99 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ కు 20.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 💡 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 5.18 లక్షల నుంచి రూ. 5.46 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. 📱 దీనిలో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది. 📲
🚗 మారుతి సుజుకీ సెలెరియో.. భారతదేశంలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను విరివిగా అందిస్తున్న సంస్థ మారుతి సుజుకీ ఇప్పటి వరకూ దాదాపు 4 లక్షల ఏఎంటీ వాహనాలను విక్రయించింది. 🚙 ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన మొట్టమొదటి కారు ఈ మారుతి సెలెరియో. దీనిలోని ఇంజిన్ 67 హార్స్ పవర్ తో పాటు 90 ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. లీటర్ పై 23.1 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. 💰 దీని ధర రూ. 4.97 లక్షల నుంచి రూ. 5.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. 💸
🚗 టాటా టియాగో.. మన దేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన కారు ఇది. 1.2-లీటర్ ఇంజన్ 84 హార్స్‌పవర్, 114 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ కు ఏకంగా 23.8 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 🚘 మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు ఏఎంటీ 5-స్పీడ్ ఆటోమేటిక్ వెర్షన్‌ను కూడా అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 5.04 లక్షల నుంచి రూ. 5.63 లక్షల వరకు ఉంటాయి. 🛣️