ఐదు రోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతాలో క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన బెంగాల్ క్రీడా మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ..
ఇప్పుడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. మళ్లీ క్రికెట్ ఆడతానంటూ ముందుకొచ్చాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నానని, ఇందుకు అభిమానులు క్షమించాలన్నాడు. నిజానికి గత రంజీ ప్రారంభానికి ముందు తన రిటైర్మెంట్ గురించి మాట్లాడిన మనోజ్.. రంజీ ట్రోఫీ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పాడు. అయితే గత రంజీ ఫైనల్లో బెంగాల్ సౌరాష్ట్ర చేతిలో ఓడి చాంపియన్ టైటిల్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కూడా మనోజ్ తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించిన ఐదు రోజుల తర్వాత నిరసన సభ నిర్వహించిన మనోజ్.. అందరి ప్రేమ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పేర్కొన్నాడు. 🏆🎉