top of page
MediaFx

టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ అసంతృప్తి🏏


క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏలలో ఈ పొట్టి ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్నీ టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీ కోసం టీమ్ ఇండియా కొత్త జెర్సీ సోమవారం (మే 06) లాంఛ్ చేశారు.. టీమ్ ఇండియా కిట్ స్పాన్సర్‌షిప్ హక్కులను కొనుగోలు చేసిన అడిడాస్ ధర్మశాల వేదికగా టీమిండియా న్యూ జెర్సీని ఆవిష్కరించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సమక్షంలో ఈ కొత్త జెర్సీని విడుదల చేశాయి. కాగా బీసీసీఐ జెర్సీ విడుదల వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా జెర్సీ.. బ్లూ, ఆరెంజ్ కలర్ల కాంబినేషన్‍తో రూపొందింది. జెర్సీ ఎక్కువ శాతం బ్లూ కలర్‌లో ఉండగా.. భుజాలపై మాత్రం ఆరెంజ్ కలర్ ఉంది. దీనిపై వైట్ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి. కాలర్‌పై భారత జాతీయ పతాకం మూడు రంగులు ఉన్నాయి. జెర్సీ ఇరు వైపులా కూడా సైడ్‍కు ఆరెంజ్ కలర్‌లో లైన్‍ కనిపిస్తోంది. ఈసారి జెర్సీలో కాషాయ రంగు ఎక్కువగానే ఉంది. జెర్సీపై టీమిడియా పేరు కూడా ఆరెంజ్ రంగులోనే ఉంది.

ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. అలాగే ఈ జెర్సీపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది జెర్సీని ‘స్టైలిష్’ అని పిలుస్తుంటే, మరికొందరు మాత్రం కాషాయం రంగు ఎక్కువైందంటూ కామెంట్లు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో టీమ్ ఇండియా తన పోరాటాన్ని ప్రారంభించనుంది. ఆ తర్వాత జూన్ 9న పాకిస్థాన్‌ తో హైవోల్టేజీ మ్యాచ్ జరుగనుంది.  ఆతర్వాత జూన్ 12 మరియు 15 తేదీల్లో వరుసగా USA , కెనడాతో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడతారు.

bottom of page