భారత ‘వెస్టిండీస్ పర్యటన’ టెస్టు క్రికెట్‌లో సరి కొత్త శకానికి నాంది పలికింది. 🏏 అత్యంత ప్రత్యేకమైన ఓపెనింగ్ జోడీగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ-యశస్వీ జైస్వాల్ నిలిచారు. కలిసి ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతమైన భాగస్వామ్యాలను నెలకొల్పారు.
భారత ‘వెస్టిండీస్ పర్యటన’ టెస్టు క్రికెట్‌లో సరి కొత్త శకానికి నాంది పలికింది. 🏏 అత్యంత ప్రత్యేకమైన ఓపెనింగ్ జోడీగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ-యశస్వీ జైస్వాల్ నిలిచారు. కలిసి ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతమైన భాగస్వామ్యాలను నెలకొల్పారు. ముఖ్యంగా రెండో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఈ జోడీ ‘ఇంగ్లాండ్ బజ్‌బాల్’ స్టైల్ కూడా షాక్ అయ్యేలా ఆడారు.పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో నాలుగో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ 8.33 రన్‌రేట్‌తో కేవలం 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. 🌪️🏏 ఇది టీమిండియా టెస్ట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 50 భాగస్వామ్య రికార్డు.అంతేనా..? 11.5 ఓవర్లు.. అంటే 71 బంతుల్లోనే 98 పరుగులు చేశారు.అయితే ఆ 71 బంతికి రోహిత్ వెనుదిరగడంతో.. 12.2 ఒవర్లకు టీమిండియా 100 పరుగుల మార్క్‌ని చేరింది.🏏 12.2 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన టీమిండియా.. 22 సంవత్సరాలుగా శ్రీలంక పేరిట ఉన్న రికార్డ్‌ని బద్దలు కొట్టింది. 🇱🇰🏏 లంక 2001 లో బంగ్లాదేశ్‌పై 13.2 ఓవర్లలో 100 పరుగులు చేసింది. శ్రీలంక రికార్డ్ కూడా బద్దలు కావడంతో.. 🏏 టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగుల మార్క్ అందుకున్న జట్టుగా భారత్ నిలిచింది.ఇది ‘బజ్‌బాల్ బ్యాటింగ్ స్టైల్’ అని చెప్పుకునే ఇంగ్లాండ్ టీమ్‌కి కూడా సాధ్యం కాని రికార్డు.🇮🇳🏏