top of page

📢 ఇవాళ టీడీపీ-జనసేన ఉమ్మడి కీలక సమావేశం..🔍

📢 విజ‌యవాడ‌లో జ‌రిగే స‌మావేశంలో కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. 🔍 గ‌త స‌మావేశంలో మేనిఫెస్టోపై ప‌వ‌న్ క‌ళ్యాణ్-నారా లోకేష్ చ‌ర్చించారు.

ఆ త‌ర్వాత ఇటీవ‌ల చంద్రబాబుతో భేటీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా మేనిఫెస్టో విడుద‌ల‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చించారు. 👥 దీనికి కొన‌సాగింపుగా గురువారం జ‌రిగే స‌మావేశంలో మేనిఫెస్టోకు తుది రూపు తీసుకురానున్నారు. 🎉 ఇప్పటికే సూప‌ర్ సిక్స్ పేరిట తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది. 📜 ఇది ప్రిలిమిన‌రీ మేనిఫెస్టో మాత్రమే. 📅 వాస్తవంగా విజ‌య‌ద‌శ‌మి రోజు పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల చేస్తామ‌ని చంద్రబాబు అరెస్ట్‌కు ముందు ప్రక‌టించారు. 🚨 అది వాయిదా ప‌డింది. 📢 సూప‌ర్ సిక్స్‌తో పాటు మ‌రికొన్ని అంశాల‌తో టీడీపీ ప్రతిపాద‌న‌లు సిద్దం చేసింది. 🌐 🌐త్వరలో మరోసారి చంద్రబాబుపవన్ భేటీ ఇవాళ జ‌రిగే ఉమ్మడి స‌మావేశంలో తీసుకునే నిర్ణయాల‌పై మ‌రోసారి చంద్రబాబుప‌వ‌న్ భేటీలో చ‌ర్చిస్తారు. దీపావ‌ళి త‌ర్వాత మ‌రోసారి ఇద్దరు నేత‌లు భేటీ కానున్నారు. 🎉ఈ స‌మావేశంలోనే మేనిఫెస్టో విడుద‌ల‌కు తేదీని ఖ‌రారు చేయ‌నున్నారు. మ‌రోవైపు ఉమ్మడి పోరాటాల‌కు కూడా దీపావ‌ళి త‌ర్వాత ప్రత్యేక షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. చంద్రబాబుప‌వ‌న్ భేటీ కంటే ముందుగానే జేఏసీ నేత‌లు తాత్కాలిక షెడ్యూల్, మేనిఫెస్టోల‌కు తుదిరూపు తీసుకురానున్నారు. మొత్తానికి వ‌చ్చే వారం నుంచి దూకుడు పెంచేలా టీడీపీజ‌న‌సేన ప్రణాళిక‌తో ముందుకెళ్తున్నాయి.📢

ความคิดเห็น


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page