"నవంబర్ ఒకటో తేదీన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్తామని రెండు పార్టీలు ప్రకటించాయి.
రాజమండ్రిలో పవన్ కళ్యాణ్-నారా లోకేష్ ఉమ్మడిగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మేనిఫెస్టోపై అధికారిక ప్రకటన చేశారు. చంద్రబాబు బెయిల్ పై బయటికి రాకముందే మేనిఫెస్టో విడుదల వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం." 📅📢
"రాజమండ్రిలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ సమావేశంలోనే మేనిఫెస్టోపై చర్చ జరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించిన సూపర్ సిక్స్ లో కీలక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి తోడు మరో నాలుగు ప్రతిపాదనలు జనసేన తరపున ఇచ్చారు. టీడీపీ సూపర్ సిక్స్‌లో మహిళల కోసం మహా శక్తి పథకం పొందుపరిచారు." 🚺💪
"రైతుల కోసం అన్నదాత, నిరుద్యోగుల కోసం యువ గళం, ఇంటింటికీ నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ పథకాలకు అంగీకరించిన జనసేన కూడా తమ పార్టీ ప్రధానంగా గుర్తించిన సమస్యలు, హామీలను మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది." 🌾🌊💼
"రైతులు, యువత, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం పైనా మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది. జనసేన ప్రతిపాదనలపై ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి అయితే రెండు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలి అనుకున్నప్పటికీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటనలో ఉండటం, మేనిఫెస్టోలో పెట్టె అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండటంతో వాయిదా పడినట్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు." 🌏🛫📋