top of page
MediaFx

మరో యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్.. రెండు పార్ట్స్‌గా రానున్న సినిమా


తారక్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఓ పెద్ద దర్శకుడికి కాదు ఓ యంగ్ డైరెక్టర్ కు.. ఇంతకూ ఆ దర్శకుడు ఎవరంటే..  గతేడాది చివర్లో విడుదలైన ‘హాయ్ నాన్న’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శౌర్యవ్.. ఓ అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ కథను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించాడని తెలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి ఇంకా రెండేళ్ల సమయం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండేళ్లు షూటింగ్ జరుపుకున్న తర్వాతే సినిమా విడుదల కానుందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ‘దేవర’ సినిమాతో పాటు హిందీలో ‘వార్ 2’ సినిమాను కూడా మొదలుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ హిందీ చిత్రంలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈమూవీ భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రానుంది. ‘వార్ 2’ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమాలో నటించనున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ శౌర్యవ్ తో సినిమా చేయనున్నాడు.. శౌర్యవ్ దర్శకత్వం వహించే సినిమా 2026లో మొదలై మొదటి భాగం 2028లో విడుదల కానుంది. రెండో భాగం 2030లో విడుదల కానుందని తెలుస్తోంది.

bottom of page