top of page
Suresh D

కంగువ టీజర్ వచ్చేసింది.. మరోసారి సూర్య నటవిశ్వరూపం..🎉

ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‏తో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇందులో మరోసారి సూర్య సరికొత్త వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న సినిమా కంగువ. ఈ చిత్రాన్ని తమిళ్ మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నాడు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‏తో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇందులో మరోసారి సూర్య సరికొత్త వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసి మరింత హైప్ తీసుకువచ్చారు మేకర్స్. డైలాగ్స్ ఏమీ లేకుండా కేవలం విజువల్స్, బీజీఎంతోనే గ్లింప్స్ అదరగొట్టారు.ఇక విజువల్స్ ప్లస్ బీజీఎం మాత్రం గూస్ బంప్స్ అని చెప్పాలి. అడవి, భయంకరమైన ఆదివాసులు, అడవి జంతువులు, మొసళ్లు, ఖడ్గమృగాలు, సముద్రం షాట్స్ తో మరో కొత్త లోకాన్ని చూపించారు. ఇందులో సూర్య మరింత భయంకరమైన లుక్ లో కనిపిస్తున్నాడు. సైన్యాన్ని యుద్ధానికి నడిపించే భయంకరమైన.. క్రూరమైన యోధుడిగా సూర్య కనిపించాడు. ఇక ఇందులో సూర్యను ఢీకొట్టేందుకు ప్రతినాయకుడిగా యానిమల్ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం కంగువ టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.🌟


bottom of page