దేశవ్యాప్తంగా టమోటా రేట్లు భగ్గుమంటున్నాయి. పలుచోట్ల టమాట చోరీలకు కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారి తన దుకాణంలో కూరగాయలు కాపాడుకోవడానికి ఏకంగా ఇద్దరు బౌన్సర్లను నియమించుకున్నట్లు పీటీఐ ఇచ్చిన న్యూస్ తప్పుడు కథనంగా తేలడంతో లెంపలు వేసుకుంది.
దేశవ్యాప్తంగా టమోటా రేట్లు భగ్గుమంటున్నాయి. పలుచోట్ల టమాట చోరీలకు కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారి తన దుకాణంలో కూరగాయలు కాపాడుకోవడానికి ఏకంగా ఇద్దరు బౌన్సర్లను నియమించుకున్నట్లు పీటీఐ ఇచ్చిన న్యూస్ తప్పుడు కథనంగా తేలడంతో లెంపలు వేసుకుంది. ఇది పూర్తిగా అవాస్తవం మైనదని తేలడంతో క్షమాపణలు తెల్పింది. వారణాసిలోని లంక ప్రాంతాల్లో అజయ్ ఫౌజీ అనే వ్యాపారి సమాజ్ వాదీ పార్టీకి చెందిన కార్యకర్తగా పీటీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలోనే ఈ సమాచారం తమకు అందిందని, నిజ నిర్ధారణ చేయడంతో విఫలం అయినందుకు క్షమాపణలు కోరింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ ను వెంటనే తొలగించింది. ఉన్నత విలువలతో కూడిన నిష్పాక్షికమైన వార్తలను అందించడానికి తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామని హామీ ఇస్తూ ట్వీట్ చేసింది.కాగా దేశంలో టమాటా ధర కిలో రూ.140 నుంచి రూ.160 వరకు విక్రయిస్తున్నారు. 🍅💰