top of page
MediaFx

రిలేషన్లో ఉన్నా..ఒప్పేసుకున్న తమన్నా అక్కడే సంతోషం అంటూ..

మళ్లీ అదే జరిగింది. మళ్లీ అదే రిపీట్ అయింది. తమ మధ్య ప్రేమ గీమా లేదంటూ.. సెలబ్రిటీలు చెప్పే మాట.. మరో సారి పచ్చి అబద్దంగా మారిపోయింది. బుకాయించడంలో హీరోలు.. హీరోయిన్లు నెంబర్ 1 అన్న కామెంట్ మరో సారి నెట్టింట వైరల్ అవుతోంది. మీమ్స్ రూపంలో తెగ తిరుగుతోంది.

మళ్లీ అదే జరిగింది. మళ్లీ అదే రిపీట్ అయింది. తమ మధ్య ప్రేమ గీమా లేదంటూ.. సెలబ్రిటీలు చెప్పే మాట.. మరో సారి పచ్చి అబద్దంగా మారిపోయింది. బుకాయించడంలో హీరోలు.. హీరోయిన్లు నెంబర్ 1 అన్న కామెంట్ మరో సారి నెట్టింట వైరల్ అవుతోంది. మీమ్స్ రూపంలో తెగ తిరుగుతోంది. ఇందంతా ఎందుకంటే.. తమన్నా.. తాను రిలేషన్లో ఉన్నా అంటూ.. ఉన్నట్టుండి మాట మార్చి చెప్పారు కనుక. ఎస్ ! నిన్న మొన్నటి వరకు విజయ్‌ వర్మతో ముంబాయ్ వీధుల్లో చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగిన తమన్నా.. విజయ్‌ తనకు జెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన మాటను.. ఉన్నట్టుండి మార్చేశారు. విజయ్‌ వర్మతో తాను రిలేషన్లో ఉన్నట్టు.. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడే సంతోషం అంటూ.. ఓ సినిమాటిక్ డైలాగ్‌ను కూడా విసిరారు. అంతేకాదు.. వీరిద్దరి అప్‌ కమింగ్ సిరీస్‌ లస్ట్ స్టోరీస్‌ 2 ప్రమోషన్లో ఉన్న తమన్నా.. ఇంకా చాలా విషయాలే పంచుకున్నారు. ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో ఉంటే సంతోషంగా ఉంటామనే ఫీలింగ్ మనకు కలగాలని.. అదే విజయ్‌తో తనకు కలిగిందన్నారు తమన్నా. తాను ఇప్పటి వరకు ఎంతోమంది హీరోలతో కలిసి నటించానని.. వాళ్లందరి కంటే తనకు విజయ్‌ ప్రత్యేకమైన వ్యక్తన్నారు. విజయ్‌ తనను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడని, కష్టం వస్తే తనతోనే ఉంటాడనే నమ్మకం బలంగా ఉందన్నారు. ఇప్పుడీ మాటలతో.. నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు ఈ మిల్కీ బ్యూటీ.



bottom of page