top of page

మీ ఫోన్‌ కెమెరాతో మంచి ఫొటోలు తీయాలా.?


స్మార్ట్‌ఫోన్‌లో ఫొటో తీసే ముందు కచ్చితంగా లెన్స్‌ను శుభ్రం చేయాలి. మనలో చాలా మంది ఫోన్‌ను పాకెట్స్‌లో, పర్స్‌లలో పెట్టుకుంటారు. దీనివల్ల లెన్స్‌ ధుమ్ముదూళి చేరుతుంది. దీంతో వెంటనే ఫొటో తీయగానే ఫొటో డల్‌గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫొటో తీసే ముందు లెన్స్‌ను శుభ్రంగా క్లీన్‌ చేయాలి.

ఇక ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కెమెరాకు సంబంధించి ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి. మనలో చాలా మంది ఇవేవి చూడకుండానే ఫొటోలు తీస్తుంటారు. అయితే ఈ ఫొటోలు క్లారిటీ రావాలంటే ముందుగా ఫోకస్‌, వైట్‌ ల్యాటెన్స్‌, హెచ్‌డీఆర్‌ వంటి సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి. వీటివల్ల ఫొటో క్లారిటీ పెరుగుతుంది.

ఫొటోలు తీసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ప్రధానమైన మరో అంశం. కెమెరాను క్లిన్‌మనిపించే సమయంలో ఫోన్‌ షేక్‌ కాకుండా చూసుకోవాలి. దీనివల్ల ఫొటో క్లారిటీ వస్తుంది. చేయి ఏమాత్రం అటుఇటు కదిలినా క్లారిటీ దెబ్బతింటుంది.

ఫొటోలు తీసే సమయంలో లైట్‌ బాగుండేలా చూసుకోవాలి. లైటింగ్ సరిగ్గా లేని సమయంలో ఫొటోలు తీస్తే క్లారిటీగా రావు. మరీ ముఖ్యంగా సూర్యకాంతి ద్వారా వచ్చే వెలుగులో ఫొటోలు తీయడం ద్వారా ఫొటో క్లారిటీ పెరుగుతుంది.

స్మార్ట్‌ఫోన్‌లో తీసిన ఫొటో క్లారిటీ రావాలంటే ఐఎస్‌ఓను తగ్గించుకోవాలి. ఐఎస్‌ఓ తక్కువ ఉంటే ఫొటో క్లారిటీ అంత ఎక్కువగా వస్తుంది. ఇది కేవలం స్మార్ట్‌ ఫోన్‌లో మాత్రమే కాకుండా డిజిటల్ కెమెరాలకు సైతం వర్తిస్తుంది.

Comments


bottom of page