top of page
Shiva YT

🚨 ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కొనసాగుతున్న ఉత్కంఠ..

🔍 తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పెరుగుతోంది. పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈసారి కచ్చితంగా ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవాలని పలువురు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

గవర్నర్ కోటాలో రెండు సీట్లు, ఇతర కోటాలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ 6 స్థానాలకు పోటీ పడే నేతల జాబితా మాత్రం ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని పలువురు నేతలకు ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసింది కాంగ్రెస్. ఇప్పుడు ఆ నేతలంతా ఎమ్మెల్సీ సీటు కావాలని కోరుతున్నారు.

🤝 వీరితో పాటు పొత్తుల్లో భాగంగా పలువురు ఇతర పార్టీల నేతలు కూడా ఈసారి ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. వీరిలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కించుకుంటే.. మంత్రిగా రేసులో ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆశావాహుల పేర్ల జాబితాను అధిష్టానం పెద్దల ముందు ఉంచబోతున్నారని తెలుస్తోంది.

bottom of page