top of page

🌟👑 ఐదు గెటప్స్‌లో అలరించనున్న సూర్య..

సూర్య గెటప్ ఈ సినిమాలో చాలా విభిన్నంగా ఉంది. ఈ మూవీలో సూర్య ఒక క్రూర రాజు పాత్రలో కనిపిస్తాడని గుసగుసలు వినిపించాయి.

ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే సినిమాను త్రీడి ఫార్మేట్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తమిళ్ తో పాటు తెలుగులో సూర్యనే డబ్బింగ్ చెప్పనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కంగువ సినిమా గురించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

కంగువ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందట.. రాజుల కాలంతో పాటు ఇప్పటి జనరేషన్ కు లింక్ ఉంటుందని అంటున్నారు. అలాగే సూర్య ఈ సినిమాలో ఏకంగా ఐదు గెటప్స్ కి కనిపించనున్నారట. 2024 సమ్మర్‌ స్పెషల్‌గా కంగువ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సైలెంట్ గా షూటింగ్ ను కానిచ్చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండే భారీ ప్రియాడికల్ డ్రామా కంగువ. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 🎬🎶


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page