top of page

బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న సూర్య.. 🌟🎥

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు హీరో సూర్య. ప్రస్తుతం ‘కంగువ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు సూర్య.

ఎన్నో డిఫరెంట్ రోల్స్ లో నటించి మెప్పించనున్నాడు సూర్య. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్‌డేట్‌లు వస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం సూర్యకు జోడీగా ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాతో సూర్య హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు.

🎬👍

ఈ సినిమా ‘మహాభారతం’ ఆధారంగా తెరకెక్కుతోందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇందులో సూర్య కర్ణుడిగా నటించనున్నాడట. ప్రస్తుతం సూర్య నటించిన ‘కంగువా’ సినిమా చాలా బిజీగా ఉంది. ఈ సినిమా గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ పాత్రల్లో సూర్య నటిస్తున్నారు. ఈ చిత్రంలో దిశా పటాని, బాబీ డియోల్, జగపతి బాబు తదితరులు నటించారు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. కంగువా సినిమా 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతోంది. 🎦💰

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page