రోదసి నుంచి ప్రపంచంలో ఎవరిపైనైనా, ఎవరు ఎక్కడున్నా వారిపై తీక్షణంగా నిఘా పెట్టగలిగే ఓ అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది నింగిలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతుంది.
అమెరికా స్టార్టప్ ‘అల్బెడో’ రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలానికి కేవలం 100 మైళ్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. నింగి నుంచి వ్యక్తులపై లేదా ఏదైనా వస్తువులు, ప్రాంతాలపై నిశితంగా దృష్టి సారించగలదని నిపుణులు చెప్తున్నారు. దీన్ని నింగిలో ప్రవేశపెడితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్రమైన ముప్పు వాటిల్లడం ఖాయమని, ఓ ‘బిగ్ బ్రదర్’ నిత్యం మనల్ని, మన కదలికలను సునిశితంగా గమనించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని ‘అంతరిక్షంలో ఉండే భారీ కెమెరా’గా ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ జనరల్ కౌన్సెల్ జెన్నిఫర్ లించ్ అభివర్ణించారు. మనకు తెలియకుండా దీన్ని ఏ ప్రభుత్వమైనా, ఎప్పుడైనా ఉపయోగించవచ్చని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపారు.
Comments