top of page

కంగువ నుంచి సూర్య సెకండ్ లుక్ వచ్చేసింది

తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న కంగువ మూవీ నుంచి అతని సెకండ్ లుక్ వచ్చేసింది. ఈ మూవీ మేకర్స్ మంగళవారం (జనవరి 16) ఈ లుక్ రిలీజ్ చేశాడు.

ఈ ఏడాది రానున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటి సూర్య నటిస్తున్న కంగువ. పాన్ ఇండియా మూవీగా వస్తున్న కంగువ నుంచి మంగళవారం (జనవరి 16) సూర్య సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మధ్యే మూవీలో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న సూర్య.. తాజాగా రిలీజ్ చేసిన సెకండ్ లుక్ లో చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

కంగువ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఇండియాలోని భాషలతోపాటు జపనీస్, కొరియన్ లాంటి విదేశీ భాషల్లోనూ రాబోతోంది. ఈ రెండో పోస్టర్ ను మేకర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా రిలీజ్ చేశారు. స్టూడియో గ్రీన్ ఈ కంగువ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

"విధి అన్నది సమయం అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు కంటే బలమైనది. అందరి నోటా ఒకే పేరు ప్రతిధ్వనించాలి. అదే కంగువ. కంగువ సెకండ్ లుక్ ఇక్కడ చూడండి" అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. గతేడాది నవంబర్ లోనే ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. అందులో సూర్య ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఓ కొత్త అవతారంలో కనిపించాడు.

దీంతో ఆ పోస్టర్ వెంటనే వైరల్ గా మారింది. ఇక ఈ సెకండ్ లుక్ లోనూ సూర్య రెండు వేర్వేరు లుక్స్ లో కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్లో మంటల్లో కాలిపోతున్న పక్షి కనిపిస్తుండగా.. దాని ముందు సూర్య ఎంతో ఇంటెన్స్ లుక్ లో ఉన్నాడు. ఇక ఆ వెనుక సూర్య మరో లుక్ కూడా కనిపించింది. ఈ కంగువ మూవీలో సూర్య సరసన బాలీవుడ్ నటి దిశా పటానీ నటిస్తోంది.

ఈ మధ్యే కంగువ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు సూర్య. గత బుధవారం (జనవరి 10) ఈ మూవీలో తన చివరి షాట్ షూటింగ్ పూర్తయినట్లు చెబుతూ అతడు ఓ ఫొటో షేర్ చేశాడు. అందులోనూ సూర్య డిఫరెంట్ లుక్ లో కనిపించాడు.

"కంగువలో నా చివరి షాట్ పూర్తయింది. మొత్తం మూవీ యూనిట్ సానుకూలంగా ఉంది. ఇది ఒకదానికి ముగింపు కాగా.. మరెన్నింటికో ఆరంభం. మంచి జ్ఞాపకాలు అందించిన డైరెక్టర్ శివ, టీమ్ కు థ్యాంక్స్. కంగువ నాకు చాలా స్పెషల్. మీ అందరూ ఈ సినిమాను స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని సూర్య ట్వీట్ చేశాడు.

కంగువ గురించి పెద్దగా డిటేల్స్ బయటకు రాక ముందే ఈ మూవీ డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తం చెల్లించడం ఆశ్చర్యం కలిగించింది. ఏకంగా రూ.80 కోట్లతో హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అది కూడా సౌతిండియా భాషలైన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వరకూ ఇంత మొత్తం చెల్లించారు. ఇక హిందీ కోసం ఎంతనేది తెలియలేదు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page