top of page

సాయుధపోరాటం పై అవాస్తవాలు, వక్రీకరణలు : సురవరం సుధాకర్ రెడ్డి


ఏప్రిల్ 26 ఆంధ్రజ్యోతి దినపత్రికలో “కమ్యూనిజం వేరు కమ్యూనిస్టు పార్టీలు వేరు” అనే పేరుతో సీనియర్ జర్నలిస్టు డానీ రాసిన వ్యాసం అవాస్తవాలతో ఆధారాలు లేని ఆరోపణలతో కూడి ఉంది. ముస్లింలనే కాదు భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులకు ఏ అస్తిత్వ సమూహాలు నచ్చవు అని రాయటంలోనే కమ్యూనిస్టులు ముస్లింలకు వ్యతిరేకమని డానీ అభిప్రాయ స్పష్టత అవుతుంది. అలాగే బ్రిటిష్ ఇండియా దాదాపు 560 ప్రిన్సిల స్టేట్స్ ఉండగా నిజాం సంస్థానంలోనే మాత్రమే ఎందుకు కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారో అని ఎవరికైనా రావాల్సిన ప్రశ్న. ఆ సంస్థల కన్నా నిజం పరిపాలన క్రూరమైనది అనేది తార్దిక వాదన కావచ్చు కానీ వాస్తవం అది కాదు విద్యా, వైద్య, ఆరోగ్య, నీటిపారుదల, రైల్వే, విద్యుత్ తదితర రంగాలన్నిట్లో నిజాం మిగిలిన సంస్థానాల కన్నా ముందున్నది. ఇంకేదో కారణం ఉండాలి అని డానీ రాశారు.

డానీకి మరేదో కారణం మత ప్రభావం అని కనుగొన్నారు. దానికి దేవులపల్లి వెంకటేశ్వరావు గారి పుస్తకాన్ని రిఫర్ చేశారు. ఇది శుద్ధ అబద్ధపు ఆరోపణ. హిందూ భూస్వాములు సహజంగా నిజాంనికి వ్యతిరేకంగా ఉంటారు. కనుక వారి భూములను పేదలకు పంచకూడదని కమ్యూనిస్టు పార్టీ నాయకులు వాదించారని దేవులపల్లి గారు చెప్పనట్లు డానీ చెప్తున్నారు.

తెలంగాణ విశాల హైదరాబాదు సంస్థానాలలో ఒక పెద్ద భాగం. కమ్యూనిస్టు పార్టీ నాయకులు దేశంలో అతిపెద్ద ఫ్యూడల్ సంస్థానమైన నిజాం రాష్ట్రంలో ముందు ఆంధ్ర మహాసభ ద్వారా ప్రాథమిక హక్కుల కోసం పోరాడారు. ఆ తరువాత సాయుధ పోరాటం గా రూపాంతరం చెందిందని అందరికీ తెలిసిందే.

సాయుధ పోరాటం ఎక్కడ పరిస్థితులు పరితత్వం అయితే అక్కడ ముందుకు పోతుంది. హిందూ రాజు పరిపాలిస్తున్న కాన్పూర్ - కొచ్చిన్ సంస్థానంలో కమ్యూనిస్టులు పోష్ణాప్ర వయోలార్ సాయుధ పోరాటం చేశారు. మణిపూర్ లో రాచారికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. తెలంగాణతో పోలిస్తే అవి చిన్నవే కావచ్చు కొన్ని వందల మంది అక్కడ కూడా అమరులు అయ్యారు.

సాయిధ పోరాటాన్ని రెండు జిల్లాల పోరాటంగా నల్గొండ - వరంగల్ జిల్లాల పోరాటంగా చిత్రీకరించడం దారుణం. కరీంనగర్, అదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు కూడా ఇది విస్తరించింది. పోతే నల్గొండ - ఖమ్మం - వరంగల్ - కరీంనగర్ జిల్లాలో మరింత విస్తారంగా జరిగింది

హైదరాబాదు సంస్థానాల్లో విద్యా, వైద్యం, ఆరోగ్య, రైతు, విద్యుత్, అని రంగాలలో ముందుండేది అనేది శుద్ధ అబద్ధం. హైదరాబాదులో కొన్ని సౌకర్యాలు కలిస్తే అది రాష్ట్రమంతటా జరిగినట్లా, రాష్ట్రంలో తెలుగు, మరాఠి, కన్నడ భాషల్లో చదువుకోడానికి అనుమతి లేదు. హైదరాబాద్ వరంగల్ లో తప్ప స్కూల్లో లేవు. జిల్లాలలో కరెంటు లేదు. టర్కిష్ సామ్రాజ్య పతనం తరువాత తానే ప్రపంచ ముస్లిం ప్రపంచానికి అధిపతి కావాలనే కోరికతో యూనివర్సిటీని, ఉస్మానియా దవాఖానను, రైల్వేను హైదరాబాద్లో వరంగల్లో కొన్ని పరిశ్రమలు పెట్టి ఆధునికుడనని అనిపించుకోవాలని ఉస్మాన్ అలీఖాన్ ప్రయత్నించాడని, అయన సన్నిహితుడొకరూ వ్రాసిన గ్రంధంలో ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాలలో నిరంకుశమైన భూస్వాములు, దేశము ఖలీల పాలనయ్యి ప్రజలు నలిగిపోయారు.

హిందూ భూస్వాములు నిజాం ను వ్యతిరేకించారన్న మాట శుద్ధ అబద్ధం. నిజాం మద్దతుతోనే వారు రైతులను పేద ప్రజలను దారుణంగా దోపిడీ చేశారు మహిళలను మానభంగం చేశారు.

ముస్లిం రైతు బందగిని హిందూ భూస్వామి పిసునూరి రామచంద్ర రెడ్డి చంపేస్తే భూస్వామికి శిక్ష పడలేదు పోలీసు యాక్షన్ వరకు నిజాం మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రి పింగళి వెంకట రామారెడ్డి గారు ఉన్నారు. నిజాం కోసం తన ప్రాణాలర్పిస్తానని సరెండర్ కావద్దని చెప్పింది ఆయనే.

ప్రారంభం నుండి డానీ గారు ఇస్లాం మతం దృక్పథం నుండే రాసినట్లు కనబడుతున్నది. తాస్కట్లో ముస్లిం యువకులు ఇండియన్ కమ్యూనిస్టు పార్టీని పెడితే దానిని నిరాకరించి 1925లో కాన్పూర్ లో సిపిఐ ని ఏర్పాటు చేశారని వ్రాశారు తాస్కాంత సమావేశం తర్వాత పార్టీగా రూపం చెందలేదు. అన్ని ప్రాంతాలవారు లేరు ఆ ప్రకటన మాత్రం ఉంది. పార్టీకి ప్రోగ్రామ్ లేదు నాయకత్వం లేదు అందువల్ల 1925 డిసెంబర్ 26న దేశంలోని వివిధ ప్రాంతాల వామపక్ష గ్రూపులు కలిసి సిపిఐని ఏర్పాటు చేసాయి. విదేశీ గడ్డమీద కాకుండా స్వదేశంలోనే పార్టీ ఆవిర్భవించింది దీనిమీద డానీ గారికి బాదేమిటి?.

తెలంగాణలో నిజాం పరిపాలన ఆయన చెప్పినట్టు ఉంటే సాయుధ పోరాటానికి అంత త్వరగా విస్తారమైన ప్రాంతాలలో మద్దతు ఎలా లభించింది కమ్యూనిస్టు నాయకులకు ముస్లిం వ్యతిరేకత ఉంటే సాయుధ పోరాటం రోజుల్లో పంచిన పది లక్షల ఎకరాలు లో నూటికి 99 శాతం హిందూ భూస్వాములది ఎలా పంచారు. సాయుధ పోరాటానికి పిలుపిచ్చిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తో పాటు మఖ్డుం మొహిద్దిన్ కూడా ఉన్న మాట వాస్తవం కాదా? రజకారులు హత్య చేసిన అమ్రోజ్ ఉర్దూ పత్రిక సంపాదకుడు సోయా జిల్లా ఖాన్ ముస్లిం కాదా ?

గ్రామంలో రజాకార్లు క్రూరమైన అత్యాచారాలు చేస్తే వారిని కమ్యూనిస్టులు, ప్రజలు చంపేశారు. సాధారణ ముస్లిం భక్షరిని కూడా సాయుధ పోరాటంలో చంపిన ఆరోపణలు లేవు. పండిట్ సుందరిలాల్ ఈ అంశంపై జరిపిన విచారణ తర్వాత నివేదికలో మరద్వాదలో ముస్లింలపై హత్యాకాండ జరిగిందని రాశారు. తెలంగాణ ప్రసక్తే లేదు. గత సంవత్సరం ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవాసి తెలంగాణ సాయుధ పోరాటాన్ని, ఫ్యూడల్ వ్యతిరేక పోరాటమని ప్రకటించాడు.

తెలంగాణ సాయుధ పోరాటం విరోచితమైంది చరిత్రాత్మకమైనది సాయుధ పోరాటాన్ని ఉపసంహరిస్తూ రావి నారాయణ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. కేంద్ర రాష్ట్ర కమిటీలే నిర్ణయం చేసి ప్రకటన చేసాయి. పోలీసు చర్యతో మధ్యతరగతి ప్రజలు, రైతులు, వ్యాపారస్తులు తదితర వర్గాలలో భారత యూనియన్ లో విలీనం తర్వాత సాయుధ పోరాటానికి తమ మద్దతు అవసరం లేదని భావించారు అందువల్లే రెండవ దశలో 3,500 మంది కమ్యూనిస్టులు చనిపోయారు. మొదటి దశలో వెయ్యి మంది దాకా చనిపోయివుంటారు. పేద ప్రజల్లో గందరగోళం ఏర్పడింది నిజాం సైన్యానికి పాతకాలం ఆయుధాలు భారత సైన్యానికి అధునాతనమైన ఆయుధాలు. విప్లవ పోరాటాలు ప్రజలు నిర్వహిస్తారు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహిస్తుంది. ప్రజల్లో మద్దతు బలహీనమైనప్పుడు ప్రజారాజ్యం ఇంకా రాలేదని ఆఖరి కమ్యూనిస్టు దాకా పోరాడి మరణించడం వీరోచితమా?. అందువల్లే ఉపసంహరణ జరిగింది ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

డానీ గారు అంగీకరించిన అంగీకరించకపోయినా సాయుధ పోరాటం వల్లే పోలీస్ యాక్షన్ జరిగింది భూ సంస్కరణల ఎజెండా దేశం ముందుకు వచ్చింది భూ సౌమ్య వ్యవస్థ బలహీనమై పతనమైంది కమ్యూనిస్టుల చర్యలు సరైనవని 1952 జనరల్ ఎన్నికల్లో ప్రజల్లో తీర్పు చెప్పారు రావి నారాయణరెడ్డి గారికి సుంకం అచ్చలు కు నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు రావటానికి కూడా డానీ గారు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. భూస్వాముల బహుమతిగా దానిని వర్ణిస్తున్నాడు. సాయిధ పోరాటం లో అనేకమంది భూస్వామ్యులు పారిపోయారు. గడీలు బద్దలయ్యాయి కొంతమంది హత్య చేయబడ్డారు వారు రావి నారాయణరెడ్డి గారికి మద్దతు ఇచ్చి గెలిపిస్తారా అంతకంటే అసంబద్ధత ఉందా?

ఆయన వ్యాసంలో తీవ్ర వైరుధ్యం వుంది. నిజాంకు వ్యతిరేకంగా సాయుధం పోరాటం ఎందుకు చేసినట్లు అని ప్రారంభించి, పోరాట విరమణతో ఏమి సాధించారు అని ఆఖరున ప్రశ్నిస్తున్నారు ?

కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని తప్పులు చేసి వుండవచ్చు. ఆత్మ విమర్శలు చేసుకున్నాం. అవసరమైతే ఇంకా చేసుకుంటాం.

భారతదేశంలో విప్లవానికి కమ్యూనిస్టులు తమ స్వంత మార్గం ద్వారానే పోరాడుతున్నారు. సిపిఐ, సిపిఐ ( యం ) తదితర కమ్యూనిస్టుల పార్టీ ప్రోగ్రామ్ లతో దీనిని చదివి అర్ధం చేసుకోవచ్చు.

తాను మార్కిస్టు నంటూనే కమ్యూనిస్టుల మీద ఇంత నీచమైన బురద చల్లడం సరైంది కాదు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page