top of page
Shiva YT

సురవరం ప్రతాప్ రెడ్డి 127వ జయంతి వేడుకలు..

10:00 AM May 28-2023 కాన్పరెన్స్ హాల్ మొదటి అంతస్తు రవీంద్ర భారతి హైదరాబాద్..

జననంసురవరం ప్రతాపరెడ్డి

మే 28, 1896

మహబూబ్ నగర్ జిల్లా లోని ఇటిక్యాలపాడు గ్రామం

మరణం : ఆగష్టు 25, 1953

నివాస :మహబూబ్ నగర్ జిల్లా లోని బోరవెళ్లి

ఇతర పేర్లు:సురవరం ప్రతాపరెడ్డి

వృత్తిహైదరాబాద్ రాష్ట్రం శాసన సభ్యులు-వనపర్తి,(1952

పత్రికా సంపాదకుడు

పరిశోధకుడు

పండితుడు

రచయిత

ప్రేరకుడు

క్రియాశీల ఉద్యమకారుడు

ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడు(1944) ప్రసిద్ధి : ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత

అమూల్య గ్రంథ సూక్ష్మ వ్యాఖ్యాత

సురవరం ప్రతాప్ రెడ్డి 127వ జయంతి వేడుకలకు ముఖ్య అతిధి గా శ్రీనివాస్ గౌడ్ రాబోతున్నారు, కాన్పరెన్స్ హాల్ మొదటి అంతస్తు రవీంద్ర భారతి హైదరాబాద్ లో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు.

bottom of page