top of page
Suresh D

ఉచితాలను నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిల్📋🚫

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత తాయిలాలను తప్పుబడుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురువారం (మార్చి 21) విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఓటర్ల నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలు చేస్తున్న ఉచిత వాగ్థానాల ప్రకటనలు రాజ్యాంగ ఉల్లంఘనగా పిటిషన్‌ పేర్కొన్నారు. వీటిపై తక్షణమే నిషేధం విధించేలా కేంద్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పిల్‌ను దాఖలు చేశారు. ఈ పరిణామం ఏప్రిల్ 19న జరనున్న సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికల సమయాల్లో ఉచిత వాగ్థాన ప్రకటనలు చేసే పార్టీల చిహ్నాలను స్తంభింపచేయాలని, అటువంటి పద్ధతుల్లో ప్రచారం చేసే పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసేలా ఎన్నికల సంఘం చర్యాలు తీసుకోవాలని పిల్‌లో ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశం ప్రాముఖ్యతను గుర్తించి  ఇది చాలా ముఖ్యమైన అంశమని, ఈ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. 📋🚫

bottom of page