top of page

🏛️📜 చంద్రబాబు కేసులను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

🏛️📜 చంద్రబాబును అరెస్టు చేసిన స్కిల్‌ స్కామ్‌లో అత్యంత కీలకంగా మారిన సెక్షన్‌ 17Aపై సుప్రీంకోర్టులో జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేది నాలుగోసారి సుదీర్ఘ వాదనలు జరిగాయి.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17A చంద్రబాబుకు వర్తించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్‌ అడ్వకేట్‌ ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. 📜అదే సమయంలో 17A అన్నది సెక్షన్‌ 19 తరహా సంపూర్ణ రక్షణ కాదని, నిజాయితీపరులైన అధికారులకు సెక్షన్‌ 17A అన్నది ఒక రక్షణ మాధ్యమమని అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు. 🏛️సెక్షన్‌ 17A అమల్లోకి రాకముందే అంటే జూన్‌ 2018లోనే ఈ కేసు విచారణ మొదలైందని అన్నారు. 📆ఇలాంటి సందర్భాల్లో సందేహాలు తలెత్తినప్పుడు అవినీతి నిర్మూలన వైపే కోర్టులు మొగ్గు చూపాయని గుర్తు చేశారు. 🏛️

ఈ కేసుకు సంబంధించి ఒక విజిల్ బ్లోయర్‌ కూడా గతంలో ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 🏛️

దీనికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్‌ మన్మోహన్‌సింగ్‌ కేసును ముకుల్‌ రోహత్గి ప్రస్తావించారు. 📜

🏛️🗳️ స్కిల్‌ స్కామ్‌ను సెబీ, ఆదాయపన్ను విభాగం మరెన్నో సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని కోర్టుకు తెలిపారు. 📜దాదాపు గంటన్నర సేపు ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. 🏛️తన వాదనలు పూర్తి చేయడానికి మరో ముప్పావు గంట పడుతుందని తెలిపారు. 🕔ఈ క్రమంలో కేసు విచారణను సోమవారం చేపడతామని న్యాయమూర్తులు సూచించారు. 🏛️సోమవారం తాను హాజరుకాలేనని మంగళవారానికి వాయిదా వేయాలని రోహత్గి కోరడంతో కేసు విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. ⚖️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page