top of page

హిమాలయాల్లో సేదతీరుతున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌..🌟💫

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటించిన 'జైలర్' ఆగస్ట్ 10న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 72 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డుల మోత మోగించింది.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటించిన 'జైలర్' ఆగస్ట్ 10న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 72 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డుల మోత మోగించింది. దీంతో జైలర్‌ చిత్ర బృందమంతా సంబరాల్లో మునిగితేలుతోంది.అయితే సింప్లిసిటీకి కేరాఫ్‌గా నిలిచే రజనీ కాంత్‌ మాత్రం ఇప్పుడు హిమాలయాల్లో సేద తీరుతున్నారు. చాలా కాలం తరువాత అక్కడికి వెళ్లిన ఆయన.. ప్రశాంత వాతావరణంలో మనశ్శాంతిని పొందుతున్నారు.ఉత్తరాఖండ్‌లోని హృషీకేశ్‌లోని దయానంద సరస్వతి ఆశ్రమంలో రజనీకాంత్ నివాసం ఉంటున్నారు. అక్కడున్న రుషులు, భక్తులతో కలిసి సేద తీరుతున్నారు సూపర్‌ స్టార్‌. ర జనీకాంత్‌ హిమాలయాల ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి.🌟🎬


Комментарии


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page