top of page

జిమ్ ట్రైనర్ పర్యవేక్షణలో నమ్రత కఠిన వ్యాయామం...

సూపర్ స్టార్ మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ వర్క్ అవుట్ వీడియో వైరల్ అవుతుంది. ట్రైనర్ పర్యవేక్షణలో ఆమె కఠిన కసరత్తులు చేశారు.

వయసుతో సంబంధం లేకుండా అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇక సెలెబ్రిటీలు అయితే చెప్పాల్సిన పనిలేదు. వయసు కనపడకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. సూపర్ స్టార్ మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ అందం విషయంలో చాలా పర్టిక్యులర్. వ్యాయామం ఆమె దినచర్యలో భాగంగా ఉంటుంది. 51 ఏళ్ల నమ్రత కఠిన నియమాలు పాటించి యంగ్ లుక్ మైంటైన్ చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ జిమ్ వీడియో షేర్ చేశారు. సదరు వీడియోలో జిమ్ ట్రైనర్ పర్యవేక్షణలో నమ్రత కసరత్తులు చేస్తున్నారు.

గతంలో నమ్రత చేయని పుల్ అప్స్, స్విస్ బాల్ ప్లాంక్, రోల్ అవుట్ ఎక్సర్సైజులు ఆమె చేశారట. ట్రైనర్ కుమార్ మన్నవ ఆమెకు సహనంగా శిక్షణ ఇచ్చారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. నమ్రత సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. అదే సమయంలో నమ్రత బ్యూటీ సీక్రెట్ ఇదా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


మరోవైపు మహేష్-నమ్రత టాలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్నారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాలంటే సింపుల్ గా మహేష్-నమ్రతలను చూపిస్తే సరిపోతుంది. అంత గొప్ప అన్యోన్య దాంపత్యం వారిది. ముంబైలో పుట్టిన పెరిగిన ఒక అల్ట్రా మోడ్రన్ హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం, ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం. మహేష్ కోసం కెరీర్ వదిలేసిన నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తింది. పెద్దవారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సాంప్రదాయంగా నమ్రత ఉంటారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు. ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మహేష్ కెరీర్ పై ఆమె ఫోకస్ పెట్టారు. మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు.

మహేష్ ఎండార్స్మెంట్, వ్యాపారాలు, సినిమా డేట్స్ నమ్రతనే చూసుకుంటారు. అదే సమయంలో మహేష్ భార్య నమ్రతకు చాలా గౌరవం ఇస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. మహేష్ కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం. ఏమాత్రం విరామం దొరికినా భార్యాపిల్లలతో ఫారిన్ ట్రిప్ కి చెక్కేస్తారు. మహేష్ ప్రతి కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోయే ముందు, ఆ చిత్రం విడుదలయ్యాక ట్రిప్ కి వెళతారు. ఇది ఆయన ఒక అలవాటుగా, సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. నెలల తరబడి సాగిన షూటింగ్ లో పడ్డ కష్టమంతా వెకేషన్ లో మర్చిపోతాడు. వంశీ సినిమా షూటింగ్ లో నమ్రత-మహేష్ మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఐదేళ్లు వీరి మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రతల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు. మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం. గత ఏడాది మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. 2022 జనవరిలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్ లో అమ్మ ఇందిరాదేవి మరణించారు. ఇక నవంబర్ 15న తండ్రి కృష్ణ కన్నుమూశారు. ఏడాది వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యులను మహేష్ కోల్పోయారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page