కెరీర్ ప్రారంభించిన మొదట్లోనే లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘అరుంధతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2009లో డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన స్వీటీ.. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కెరీర్ ప్రారంభించిన మొదట్లోనే లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘అరుంధతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2009లో డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సోనూసూద్, అర్జన్ బజ్వా కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా భారీ వసూళ్లుతోపాటు ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలని గెలుచుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు జేజమ్మగా దగ్గరయ్యింది. ఇప్పటికీ బుల్లితెరపై ఈ చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో అరుంధతి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మరీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను మీరు తెలుసుకోండి.
గద్వాల సంస్థానం మహారాజు.. అతడి మునిమనుమరాలు జేజమ్మ అలియాస్ అరుంధతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒకపార్టీలో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి బంధవు పదే పదే గద్వాల్ కోట గురించి మాట్లాడుతుండగా.. ఆ కోట గురించి తెలుసుకోవాలని.. దానిపై ఓ సినిమా తీయాలని అనకుున్నారట. ఇక ఆ కోటకు.. చిన్నప్పుడు తాత చెప్పిన కథలోని ఓ లైన్ తీసుకుని యాడ్ చేయనుకున్నారు. కోటలో రాజకుమారి పనివాడితో ఉండగా చూసిన రాజు ఇద్దరినీ చంపేసి అదే గదిలో వారిని సమాధి చేశాడట. అదే గద్వాల్ కోటలో జరిగితే.. అని ఆలోచిస్తూ.. తర్వాత డైరెక్టర్ కోడి రామకృష్ణను పిలిచి కథ గురించి చెప్పారట. ఇక ఆ తర్వాత ఆయన ఈ కథను మరింత డెవలప్ చేశారు.
ఇక ఈ సినిమాలో అనుష్క, సోనూసూద్ ప్రధాన పాత్రలలో నటించారు. 2009 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ అప్పట్లో రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు అనుష్కకు రూ. కోటి లోపే పారితోషికం ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాగే సోనూసూద్ కు ముందుగా రూ.18 లక్షలే అనుకున్నారు. కానీ ఎక్కువ రోజులు వర్క్ చేయడంతో రూ.45 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని టాక్. ఇద్దరికి కోటిన్నరలోపే ఇద్దరికీ కోటి లోపే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.