top of page
Shiva YT

🌟🎥 సూపర్ డూపర్ క్రేజీ న్యూస్.. మరో సారి కేజీఎఫ్ 🤩🎬

🎬🌐 కేజీఎఫ్.. పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేసిన సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

కోలార్ గోల్డ్ మైన్స్‏ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కన్నడ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ నటించిన ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు.. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గవ భారతీయ సినిమాగా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో నిర్మించింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాగే ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన కేజీఎఫ్ 2 కూడా భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇప్పుడు అడియన్స్ అంతా కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేజీఎఫ్ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది. 🎉🍿


bottom of page