శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ రెండురోజుల క్రితం రాంచరణ్ అభిమానుల చేతిలో చావు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలపై సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అయ్యాడు.
లావణ్య త్రిపాఠి, రకుల్, కాజల్ ఇలా చాలా మంది హీరోయిన్లని టార్గెట్ చేస్తూ సునిశిత్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అతడికి పాపులారిటీ తెచ్చిపెట్టాయి. అయితే రోజు రోజుకి సునిశిత్ హద్దులు దాటేలా కామెంట్స్ చేయడం.. ఏకంగా లావణ్య త్రిపాఠితో తన వివాహం రహస్యంగా జరిగింది అని చెప్పడంతో ఆమె విసిగిపోయింది.
శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ రెండురోజుల క్రితం రాంచరణ్ అభిమానుల చేతిలో చావు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలపై సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అయ్యాడు. తనకి హీరోయిన్లతో చాలా లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అంటూ గతంలో సునిశిత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. దీనితో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా అతడి మానసిక స్థితి సరిగా లేదని వదిలేశారు. ఇటీవల సునిశిత్ మరోసారి సెలెబ్రిటీలపై కాంట్రవర్సీ వ్యాఖ్యలకు తెరతీశాడు. రాంచరణ్ సతీమణి ఉపాసన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ హంగామా చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఓ ఇంటర్వ్యూలో.. తాను ఉపాసన గోవాకి లాంగ్ డ్రైవ్ వెళ్లాం అని.. మేమిద్దరం ఫ్రెండ్స్ అంటూ పేర్కొన్నాడు. ఉపాసనకు ఒక ఎలెక్ట్రిక్ కారు ఉంది. ఆ కారులో మేమిద్దరం గోవా వెళ్లాం. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఫ్యాన్స్ వింటే కొడతారు అని కూడా ఇంటర్వ్యూలో యాంకర్ వార్నింగ్ ఇచ్చింది. లేదు నన్ను ఎవరూ కొట్టరు. ఎందుకంటే రాంచరణ్ కూడా నాకు ఫ్రెండ్. ఉపాసనతో నార్మల్ గా చాట్ చేస్తుంటే.. రాంచరణ్ స్వయంగా తనతో ఉపాసనని పడేయ్ అని చెప్పాడని సునిశిత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.
దీనితో రంగంలోకి దిగిన రాంచరణ్ ఫ్యాన్స్ సునిశిత్ ని చావగొట్టారు. చరణ్ ఫ్యాన్స్ దేహశుద్ది చేయడంతో తప్పైపోయింది క్షమించాలి.. ఇకపై ఉపాసన గారి గురించి కానీ వేరే సెలెబ్రిటీల గురించి కానీ తప్పుగా మాట్లాడను. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంత అతి చేస్తున్న సునిశిత్ ఎవరై ఉంటాడు? గాలికి తిరిగే ఆకతాయి అనుకుంటే పొరపాటే.. అతగాడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే.
సునిశిత్ మంచి ఉన్నత చదువులు చదివి అనేక డిగ్రీలు అందుకున్న విద్యావేత్త. అంతే కాదు ఎన్నో ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా పబ్లిష్ చేసిన మేధావి. సునిశిత్ పుట్టి పెరిగింది వరంగల్ లో. ఉస్మానియా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్స్ లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసాడు. వరంగల్ లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలెక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో బీటెక్ పూర్తి చేశాడు. అలాగే ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ లలో మూడు పేపర్లు ప్రజెంట్ చేశాడు. అనేక ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా పబ్లిష్ చేసిన మేధస్సు అతడిది.
అలాంటి పుస్తకాల పురుగు సునిశిత్ ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యాడో అర్థం కావడం లేదు అని సన్నిహితులు అంటున్నారు. బహుశా అతడి మానసిక స్థితి సరిగా లేదని కొందరు చెబుతున్నారు.