top of page

ఆరు రోజులుగా నిజాం కాలేజీలో విద్యార్ధినుల ధర్నా..


దాదాపు 1500 మంది యూజీ విద్యార్థులు అదేవిధంగా 1500 మంది పీజీ విద్యార్థులతో అత్యంత పెద్ద సంఖ్యలో కళాశాల నిర్వహణ జరుగుతుంది. ఇందులో యూజీ అమ్మాయిల కోసం 2022లో నిర్మాణం పూర్తయిన ఒక ప్రత్యేక భవనాన్ని ఆస్తులుగా కేటాయించారు దానిలో యూజీ విద్యార్థులకు దాదాపు 200 నుంచి 250 మంది విద్యార్థినిలు హాస్టల్ ఫెసిలిటీ ఎవరీ ఇయర్ కోరుకుంటారు. కానీ ఈ ఏడాది 150 మందికి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ యూజీ స్టూడెంట్స్‌కు ఇచ్చారు. మరొక 150 సీట్లను పీజీ విద్యార్థుల కోసం కేటాయించినట్లుగా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మరో 90 మంది కూడా యూజీ కోటాలో హాస్టల్ కోసం అప్లై చేసుకోగా వారికి కేటాయించకపోవడంతో విద్యార్థులంతా రోడ్డెక్కి 100% హాస్టల్ భవనాన్ని యూజీ విద్యార్థులకే కేటాయించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. సాధారణంగా పీజీ విద్యార్థులకు ఓయూ క్యాంపస్ లో ఉన్న హాస్టల్లో అధికారులు కేటాయిస్తారు.

యూజీ విద్యార్థినిల కోసమే నిర్మించిన ఈ హాస్టల్ను పీజీకి యూజీకి ఎలా సమానంగా పంచుతారంటూ అమ్మాయిలు ప్రిన్సిపల్‌ను నిలదీస్తున్నారు. కానీ ప్రిన్సిపాల్ మాత్రం విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు 50 శాతం మాత్రమే కేటాయిస్తామంటూ తేల్చి చెప్పడంతో ఎట్టి పరిస్థితుల్లో యూజీ స్టూడెంట్స్ కే హాస్టల్ను కేటాయించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందంటూ రోజుకో తరహాలో వినూత్నంగా విద్యార్థినిలు ధర్నా చేస్తూ ఉన్నారు. బుధవారం రాత్రి సెల్ఫోన్ టార్చ్ లైకులతో వినూత్నంగా ఆందోళన చేసి గురువారం మధ్యాహ్నం వంటావార్పు కార్యక్రమాలతో నిజాం కళాశాలలో ఉన్న చింతచెట్టు కిందనే బయటాయించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు నిజాం కాలేజీ విద్యార్థుల నిరసనకు ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ మద్దతు తెలిపి విద్యార్థిని యూజీ విద్యార్థినులకే హాస్టల్లో 100% కేటాయించేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే లిఖితపూర్వక హామీ వచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందంటూ విద్యార్థినిలు ఆందోళనను కొనసాగిస్తున్నారు.

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page